బాబు అసలే దూరంగా ఉన్నారు. ఏపీకి ఆయన ఎంత దూరం అంటే 600 కిలోమీటర్లు పైన అని వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కిలోమీటర్లను  లెక్క కూడా కట్టి  చెప్పారు. ఇక  పొలిటికల్ గా ఏపీకే బాబు ఇంకా దూరం కావాల్సిఉంటుందని కూడా ఆయన సెటైర్లు వేశారు. మరో వైపు జగన్ అదే పని మీద ఉన్నారు.

 

ఇపుడు చూస్తే ఏపీ, తెలంగాణాల మధ్య క్రిష్ణా నది నీటి వివాదం రాజుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టీ ఎం సీ నీటిని వాడుకునేలా 600 కోట్లతో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇదంతా వరద సమయంలో నీటిని వాడుకోవడానికే. పైగా ఈ నీరు ఉపయోగించడం వల్ల తెలంగాణాకు కూడా నష్టంలేదు. 845 అడుగులలో శ్రీశైలం రిజర్వాయర్లో నీరు ఉన్నపుడే ఎత్తిపోతల పధకం ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు పనికివస్తుంది.

 

జగన్ గత ఏడాది అధికారంలోకి వచ్చారు. అపుడు భారీ వరదలు వచ్చాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయామని జగన్ బాధపడ్డారు. దాని కోసమే ఇపుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకి శ్రీకారం చుట్టారు. సరే జగన్ కి సీమలో పూర్తి రాజకీయ మద్దతు ఉంది. ఆయన అందుకోసమే కాకుండా ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఈ స్కీం తలపెట్టారు. ఇపుడు దీని మీద తెలంగాణాలో రచ్చ అవుతోంది.

 

కేసీయార్ సైతం జగన్ మీద ఉరిమారు. అయితే ఇపుడు అక్కడ విపక్షాలు అన్నీ ఏకమై శ్రీశైలం నుంచి చుక్క నీరు తీసుకుంటే ఒప్పుకోమని అంటున్నారు. మరి ఏపీలో చూసుకుంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఈ విషయంలో కిమ్మనడంలేదు. ఆ పార్టీ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన అటు జాతీయ అధ్యక్షుడు గా ఉన్నారు. 

 


మరి ఏమంటే ఏమి వస్తుందోనని బాబు మౌనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఇప్పటిదాకా రెండు కళ్ల సిధ్ధాంతంతో నెట్టుకొచ్చిన బాబు ఆ విధంగా బాబు రెండు కళ్ళూ మూసుకుని సైలెంట్ అయితే ఏపీ రాజకీయాల నుంచి మరీ ముఖ్యంగా సీమ రాజకీయాల‌కు టీడీపీని దూరం చేస్తారని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. మరి ఇప్పటికే ఒక  ఎత్తు వేసిన జగన్ మరిన్ని పై ఎత్తులు వేసి బాబుని చిత్తు చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: