వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే. ఆయన దేని గురించి అయినా ఆలోచించాడు అంటే దాన్ని వదలడు అని కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా అంటుంటారు. చాలా వరకు జగన్ మొండివాడు అని అనుకున్నది సాధించేవరకు నిద్రపోయే వ్యక్తి కాదన్ని చాల మందికి తెలుసు. ఆ పట్టుదలే జగన్ రాజకీయాలలో విజయాలు సాధించి పెట్టింది అని అంటుంటారు. చెప్పింది చేయాలి ముఖ్యంగా పేదవాళ్లకు ఇచ్చినా మాట మీద నిలబడాలి. ప్రజలకు మంచి చేయాలి వాళ్ళ బ్రతుకులలో మార్పురావాలి. అనే ఉద్దేశంతోనే జగన్ ఎక్కువగా తన రాజకీయ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అటువంటి వైయస్ జగన్ తన పరిపాలనలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే హైలెట్ అయ్యే విధంగా పాలన అందిస్తున్నారు.

 

అధికారం లోకి వచ్చి ఏడాది కావస్తున్నా నేపథ్యంలో జగన్ పరిపాలన గురుంచి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు జగన్ తండ్రి వైస్ తో పని చేసినవాళ్లు జగన్ పరిపాలన గురుంచి తండ్రి కి మించి తనయుడు అవ్వటం గ్యారెంటీరీ అని అంటున్నారు. జగన్ పరిపాలన చాలా వరకు ఆంధ్ర ప్రజలలో కొత్త వెలుగులు నింపుతుంది అని ఆ సంక్షేమ పథకాలు చాలు ఆంధ్రలో ఏవిధమైన పరిపాలన సాగుతుందో అని చెప్పడానికి అంటూ తేగా పొగుడుతున్నారు.

 

మద్యం విషయంలో, అలాగే నగదు పంచే విషయంలో జగన్ ఇంటిలో ఉన్న ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం అనేది చాలా మంచి నిర్ణయం అని అంటున్నారు. ప్రస్తుతం దేశం లో పరిశ్రమల పై ఆధారపడి రాణించిన రాష్ట్రాలు కరోనా వైరస్ వాళ్ళ చాలా వరకు నష్టపోయాయి. ఇటువంటి సమయంలో జగన్ ఆంధ్ర లో ఉన్న వ్యవసాయ రంగాన్ని సరిగా రాణిస్తే రైతులకు సపోర్ట్ ఇస్తే చాలు ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గ్యారెంటీ అన్ని జాతీయ స్థాయి లో ఉన్న నేతలు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: