ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. అయితే దేశంలో ఏకంగా  కేసులు భారీగా పెరిగి పోవడానికి కారణం నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ అసమర్థత అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం దేశంలోనే అత్యధిక కరోనా  కేసులు  ఉన్న రాష్ట్రంగా మూడవ స్థానంలో ఉంది. ఎక్కడ ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయలేకపోవటంతో  అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది కరోనా  వైరస్. కనీసం అక్కడి ప్రభుత్వాలు సమర్థవంతంగా కట్టడి చర్యలు కూడా చేపట్టలేక పోతున్నాయి. 

 


 అయితే ప్రస్తుతం వలస కూలీల ను తరలించటం లో భాగంగా తమిళనాడుకు చెందిన 800 మంది వలస కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఈ మహమ్మారి వైరస్ కేసులు  పెరిగిపోతున్నాయి అని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో అటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఓవరాక్షన్ చేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వారి వల్లే తమిళనాడులో కరోనా  వైరస్ విజృంభిస్తుంది అంటూ ఆరోపణలు చేస్తున్నారు. 

 

 కేవలం ఆరోపణలు చేయడమే కాదు.. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరూ తమిళనాడు రాకుండా అడ్డంగా ఒక గోడ ఏర్పాటు చేయడం అంతేకాకుండా రోడ్డు పై గుంతలు తొలగించడం లాంటివి చేస్తున్నారు.  దీనిపై విశ్లేషకులు మాత్రం మండిపడుతున్నారు. దేశంలోనే అత్యధిక కరోనా  కేసులు ఉన్నా మూడవ రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారి వల్ల కరోనా  వైరస్ వస్తుంది అని చెప్పడం విడ్డూరమని చెబుతున్నారు. తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైరస్ వ్యాప్తి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కరోనా  వైరస్ కేసులు  తక్కువ ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ వాళ్లు వస్తే సమస్య ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: