ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తీరుకి దేవుడు కూడా బాధితుడు కాక తప్పలేదు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా మూతపడిన తిరుమలతో సహా అన్నీ ప్రముఖ దేవాలయాలు బోసిపోయాయి.

 

ఒకవైపు నాలుగవ దశ లాక్ డౌన్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే మినహాయింపుల్లో దేవుడి దర్శనం కూడా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతుంటే... దర్శనాలకు మినహాయింపులు ఇచ్చినా కానీ అందులో ఏమి ట్విస్టులు పెడతారని భక్త జనులంతా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గి దేవుడి దర్శనం మొదలైనా భక్తులకు దేవుని కృప దక్కకుండా కరోనా అడ్డు పడుతూనే ఉంది.

 

సాధారణంగా గుడికి వెళ్ళగానే మనం ఏం చేస్తాం? కోరిన కోరికలన్నీ తీరాలని ముందు అర్చన చేస్తాం.... తరువాత తీర్థం తీసుకుంటాం.... శఠగోపం పెట్టించుకుంటాం…. చివరికి ప్రసాదం తీసుకుని బయటకు వస్తాం. కానీ ఇప్పుడు కరోనా వల్ల ఇవన్నీ మనకు దూరం కానున్నాయి.

 

కానీ ఇప్పుడు మొఖానికి మాస్క్ లు మరియు చేతులకి శానిటైజర్ లు రాసుకుని మాత్రమే లోనికి వెళ్ళాలి. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఇచ్చే తీర్థ ప్రసాదం, శఠగోపం లాంటివి అమలు చేయవద్దని వాటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని ఆలయ బోర్డు పడుతున్నాయి.

 

శఠగోపం ఒకరి తలపై పెట్టి మరొకరికి పెడితే కరోనా వ్యాపిస్తుంది. ఇక తీర్థం చేతిలో పోసినా అదే ఇబ్బంది.. ప్రసాదాలు చేతుల్లోనే పెట్టాలి. సో ఇక నుంచి వీటన్నింటిని బంద్ చేసి కేవలం దర్శనం మాత్రమే కల్పించడానికి ఆలయాలు రెడీ అవుతున్నాయట.. భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నా సరే కరోనా వ్యాపించకుండా ఇలా చేయకతప్పదని సూచిస్తున్నారు.

 

ఇకపోతే ఇప్పటికే 50 రోజులుగా భక్తులు లేకుండా అర్చకులు మాత్రమే ధూపదీప నైవేద్యాలను కొనసాగిస్తున్నారు. మే 17 తర్వాత గుళ్ళు తెరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ తిరుమల వంటి పెద్దపెద్ద దేవస్థానాలు లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు తెరిచే సూచనలు అయితే కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: