దేశం లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 3700 కు కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. అందులో ఒక్క మహారాష్ట్ర లోనే 1495 కేసులు నమోదు కాగా తమిళనాడులో 509, ఢిల్లీ లో 359, గుజరాత్  364 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 78041 కు చేరింది అందులో 2551 మంది మరణించగా 23600 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 49185 కేసులు  యాక్టీవ్ గా వున్నాయి. ఓవరాల్ గా అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన దేశాల్లో ప్రస్తుతం ఇండియా ,కెనడా ను దాటేసి 12వ స్థానం లో వుంది. మరోరెండు రోజుల్లో  ఇండియా, చైనా ను కూడా దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది.  
 
ఇక తెలంగాణలో కూడా నిన్నభారీగానే కరోనా కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 41కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అందులో 31 హైదరాబాద్ లో నమోదు కాగా 10 వలస కూలీలు.. అలాగే 117 కరోనా బాధితులు కోలుకున్నారు. ఈకొత్త కేసులతో కలిపి తెలంగాణ లో ఇప్పటివరకు 1367 కేసులు నమోదు కాగా అందులో 939 మంది కోలుకోగా ప్రస్తుతం 394 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. కాగా రాష్ట్రం లో కరోనా మరణాల సంఖ్య 34కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఈనెల 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండగా తెలంగాణ లో మాత్రం 29 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: