ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న జగన్ తాజాగా కార్పొరేట్ స్కూళ్లకు, కాలేజీలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం ఒక్కో సెక్షన్ కు గరిష్టంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. 
 
ప్రభుత్వం నాలుగు సెక్షన్ల నుంచి తొమ్మిది సెక్షన్లకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఆగష్టు నెల నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రభుత్వం జులై నెలలో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకానానికి ఏర్పాట్లు చేసింది. 
 
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమీక్షలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. చాలామంది తల్లిదండ్రులు కరోనా విజృంభణ తగ్గే వరకు పాఠశాలలు తెరిచినా తమ పిల్లలను పాఠశాలలకు పంపబోమని చెబుతున్నారు. ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీవీ, రేడియోల ద్వారా విద్యార్థులు పాఠాలు వినేలా ఏర్పాటు చేసింది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 48 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసులకు కోయంబేడు మార్కెట్ లింకులు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా పలు జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కావడం లేదు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: