ప్రస్తుతం ప్రపంచంలోని ప్రజలు ఎవరు ఊహించని విధంగా జీవిస్తున్నారు.. ముఖాలు కనబడకుండా మాస్కులు కట్టుకుని బ్రతుకులు వెళ్ళదీస్తారని ఎవరైనా అనుకున్నారా.. ఇన్ని రోజులు ఎవరి కంట పడకుండా దొంగల్లా దాక్కోవలసి వస్తుందని అనుకున్నారా.. మద్యం ముట్టకుండా తాగుబోతులు బ్రతుకుతారని ఆలోచించారా.. కానీ అన్ని జరుగుతున్నాయి, ఇంకా ఎన్నో జరగవలసి ఉన్నాయి.. ఇకపోతే కరోనా అనే కర్కోటకుడైనా రాక్షాసుడి వల్లే ఇంత జరుగుతుంది.. అయినా వాని ప్రతాపం ఆగడం లేదు.. ఇదిలా ఉండగా ఈ వైరస్ బారిన చిక్కకుండా కనీసం ముఖానికి మాస్కు కట్టుకుని, జేబులో శానిటైజర్ పెట్టుకుని బ్రతకవలసి వస్తుంది.. ఇలాంటి నేపధ్యంలో వీటికి డిమాండ్ అమాతం పెరిగిపోయింది.. దీని వల్ల షాటేజ్ ఏర్పడింది..

 

 

ఇలాంటి పరిస్దితుల్లో మాస్క్ లకు ఉన్న డిమాండ్ ని పలువురు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతగా..అంటే వాడి పడేసిన మాస్క్ లను కూడా అమ్మేస్తున్నారట. వినటానికే భయవేస్తోంది కదూ.. మనం కొనుక్కుని వాడుకున్న మాస్క్ కూడా అటువంటిదేనా అను అనుమానం వస్తే.. వెన్నులోంచి వణుకు వచ్చేస్తుంది. ఇక ఈ ఘటన జరుగుతుంది పేద దేశంలో అసలే కాదు.. ప్రపంచానికి ఎన్నో నీతులు చెబుతున్న, అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలోని మెక్సికో నగరంలో... ఇక్కడ ఒకసారి వాడి చెత్త బుట్టల్లో పారేసిన మాస్క్‌లను తిరిగి అమ్మేస్తున్న భాగోతం బైటపడింది. ఇదేదో ఆషామాషిగా బైటకొచ్చిన న్యూస్ కాదట.. సాక్షాత్తు ఈ విషయాన్ని అక్కడి ఫార్మా కంపెనీలు తెలిపాయట.

 

 

ఇక ఈ నగరంలో ఫేస్ మాస్క్‌లకు కొరత ఏర్పడటంతో పాటు వీటి ధరలు ఆకాశన్నంటున్నంటుతున్నాయి. దీంతో లైసెన్స్ లేని వ్యాపారులు వీధుల్లో వాడి పడేసిన మాస్క్ లను తిరిగి విక్రయిస్తున్నారని, అంతే కాకుండా వాడేసిన శానిటైజర్ ఖాళీ బాటిళ్లతో నకిలీ శానిటైజర్లు తయారుచేసి విక్రయిస్తుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోందని, ఫార్మసీ యజమానులే చెబుతున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే నీచులు కేవలం డబ్బు సంపాదన కోసం దరిద్రపు పనులకు పాల్పడితే అది సమాజానికే కాదు, చివరికి వారికే చేటు చేస్తుందని తెలుసుకోవాలి అంటున్నారు నెటిజన్స్...  

మరింత సమాచారం తెలుసుకోండి: