విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా దేశాన్నే మాత్రం కలిచి వేసింది  ఈ ఘటన. దాదాపు రెండు మూడు  గ్రామాల ప్రజలు ఈ విష వాయువు  కారణంగా అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం... ఎక్కడికక్కడ నురగలు  కక్కుతూ కుప్పకూలి పోవడం ఈ దృశ్యాలు ఎంతో మందిని కలిచి  వేశాయి. ఇక ఈ దుర్ఘటనలో బాధితులందరికీ ప్రభుత్వం భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే... ఆర్థిక సాయం అందరికీ అందేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం . ఇప్పటికే ఈ దుర్ఘటనలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా మంత్రులు అధికారులు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. 

 

 

 ఈ గ్యాస్ లీకేజీ ద్వారా ప్రభావితమైన గ్రామాలను అధికారులు శుద్ధి చేయడంతో ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు తమతమ గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈ దుర్ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్  కంపెనీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎల్జి పాలిమర్స్ కంపెనీ మళ్లీ నిర్వహించబడుతుంద లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకం గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ గ్యాస్ లీకేజీ ఘటనలు అస్వస్థతకు గురై 321 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

 

 

 ఇక ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారికి ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలను ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం చర్యలు కూడా చేపట్టింది. కాగా ఈ పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తాజాగా ప్రభుత్వం లక్ష రూపాయలకు పెంచింది. పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తీసుకునేందుకు సదరు బాధితులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన డిడి లను పలువురు మంత్రులు ఆసుపత్రిలో బాధితులకు అందజేశారు. ఇక కోలుకున్న వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: