ప్రేమ ఎంత మధురం.. పరిస్థితులు అంత కఠినం అన్నట్టుంది ఓ ప్రేమికుడి బాధ.  దేశంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ఐన వారికి దూరమై ఎక్కడో సుదూరంలో ఉండి చిక్కిపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత వారం రోజుల నుంచి లాక్ డౌన్ సడలింపులు రావడంతో వలస పక్షులు బయలు దేరాయి.  ఈ నేపథ్యంలో ఓ భగ్న ప్రేమికుడు తన ప్రియురాలి కోసం సాహసం చేశాడు. ఎన్నో రకాలుగా ప్రయాణం చేసి తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రియురాలిని ఎట్టకేలకు కలుసుకున్నాడు.  ఇక్కడ అతగాడిని దరిద్రం వెంటాడింది.. దేని గురించైతే బాధపడుతూ.. భయపడిపోతున్నారో ఆ కరోనాని వెంట వేసుకొని వచ్చాడు. ఇప్పుడా యువకుడు కరోనాతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యాడు.

 

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన ఓ యువకుడు చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా చిత్తూరు జిల్లా గిరింపేటకు చెందిన యువతితో అతడికి వివాహేతర సంబంధం ఉంది. ఆమె కోసం తరుచూ చిత్తూరు వెళ్లి వస్తుండేవాడు.  గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగడంతో రావాణా వ్యవస్థ స్థంభించి పోవడంతో మనోడు ప్రియురాలి కోసం తపించిపోయాడు. అయినప్పటికీ ఆమెను కలవాలని నిర్ణయించుకున్న యువకుడు కూరగాయల లారీలో ఆంబూరు నుంచి పలమనేరుకు చేరుకుని అక్కడి నుంచి ఓ ప్రైవేటు బ్యాటరీ కంపెనీ లారీలో తిరిగి స్వగ్రామానికి చేరుకుంటుండేవాడు.

 

ఆ లారీ చెక్ చేసి అందులో 20 మందిని క్వారంటైన్ కి పంపించారు. ఆ యువకుడికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. తిరుపత్తూరు ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు యువకుడు నివసించే ప్రాంతాన్ని సీల్ చేశారు. ఇక బ్యాటరీ కంపెనీ సిబ్బంది మొత్తం 220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: