దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేంద్రం మే 18వ తేదీ నుంచి నాలుగో విడత లాక్ డౌన్ ఉంటుందని ప్రకటన చేసింది. అయితే దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో భారీ సడలింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో షాపింగ్ మాల్స్, సెలూన్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. 
 
కేంద్రం షాపింగ్ మాల్స్, సెలూన్స్ కు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే కేంద్రం అనుమతులు ఇచ్చినా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అన్నారు. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే మాల్స్, సెలూన్స్, బ్యూటీ పార్లర్లు మూతబడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సెలూన్ షాపులకు అనుమతులు ఇచ్చాయి. 
 
తాజాగా మీడియా సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తొందరలోనే బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, మాల్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన చేశారు. కరోనాతో మనం జీవించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇంట్లో లేదా ఆఫీస్ లో అడుగు పెట్టే సమయంలో శానిటైజర్ వినియోగించడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మన జీవితంలో భాగం కావాలని అన్నారు. 
 
కొత్త నిబంధనలతో నాలుగో విడత లాక్ డౌన్ డిఫరెంట్ గా ఉండనుందని చెప్పారు. నాలుగో విడత లాక్ డౌన్ మార్గదర్శకాలను మే 18వ తేదీ లోపు విడుదల చేస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి షాపింగ్ మాల్స్, సెలూన్స్ గురించి వ్యాఖ్యలు చేయడంతో వీటికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగో విడత లాక్ డౌన్ లో ప్రజా రవాణా గురించి కూడా కేంద్రం కీలక ప్రకటనలు చేయనుందని సమాచారం.      

మరింత సమాచారం తెలుసుకోండి: