ఏపీలో అధికార వైసీపీలో రోజుకో కొత్త రగడ తెరపైకి వస్తుంది. సీఎం జ‌గ‌న్మోహ న్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీ నేత‌లు ఎవ‌రు ఏ చిన్న త‌ప్పు చేసినా వాటిని స‌రి చేస్తూ ప్ర‌భుత్వానికి.. పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటున్నారు. జ‌గ‌న్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా పార్టీలో కొంద‌రు మంత్రులు.. ఎ మ్మెల్యేలు మాత్రం త‌మ కు ఇష్టం వ‌చ్చిన రీతి లో వ్య‌వ‌హ‌రిస్తున్నార న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. చాలా జిల్లాల్లో గ్రూపు రాజ‌కీయాలు.. అధికార పార్టీ నేత‌ల వెన్ను పోటు రాజ‌కీయాల‌తో పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగేలా ఉంది. 

 

వైసీపీలో రోజూ ఏదొక అంశంపై వివాదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా షాకింగ్ కలిగించే విధంగా నెల్లూరులో నీళ్లు అమ్మేసుకున్న వివాదం బయటపడింది. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత జిల్లాలోనే ఇలా జరగడంతో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది.
అసలు ఏమైందంటే...జిల్లాకు చెందిన కొందరు అధికారులు సోమశిల డ్యాంలో పదివేల క్యూసెక్కుల నీటిని అమ్మేశారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

 

ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  అధికారులపై ఫైర్ అయిపోతున్నారు. అసలు అధికారులు బరితెగించారని, తాంబూళాలలో ముడుపులు తీసుకున్నారని మండిపడుతున్నారు ఇక అధికారుల వెనుక ఉన్న నేతల పేర్లూ బయటపెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. అయితే అధికారులు ఎవరు ప్రమేయంతో ఈ పని చేశారనేది తెలియలేదు. అయితే దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఈ క్రమంలోనే మంత్రి అనిల్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇక ఈ ఆరోప‌ణ‌ల వెన‌క నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న గ్రూపు రాజ‌కీయాలు కూడా ఓ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: