కరోనా కేసులు సిటీని టెన్షన్‌‌‌‌ పెడుతుండగా, రానున్న వానాకాలం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చినుకులకే చెరువులను తలపించే సిటీలో సీజనల్‌‌‌‌ డిసీజెస్​ను సవాల్​గా తీసుకొని జీహెచ్‌‌‌‌ఎంసీ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రెడీ చేసింది. ఈసారి వానలు ముందస్తుగానే పడొచ్చనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఎంటమాలజీ వింగ్​ను అలర్ట్‌‌‌‌ చేసింది. మొన్నటి వరకు కరోనా కేసులు తగ్గిని మళ్లీ పెరిగిపోవడం ఒకంత కలవరపెడుతున్నాయి. ముక్యంగా గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా సీఎం కేసీఆర్ సైతం అధికారులకు ఒక అంచనా వేయమని చెప్పినట్లు సమాచారం. వస్తున్న కేసుల్లో 90 శాతానికి పైగా హైదరాబాద్ పరిధిలోనే వస్తుండటంతో, లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.

 

ఇక కరోనా పరిస్థితులను సమీక్షించేందుకు 15వ తేదీన సమావేశమవుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులపై రేపు ఉదయం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్న కేసీఆర్, కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఈ నెల 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది.  మొన్న ప్రధాని మోదీ... నిన్న ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇవి భవిష్యత్ లో రాష్ట్రాలకు ఏవిధంగా ఉపయోగ పడతాయన్న విషయం చర్చలు జరపబోతున్నారు. తాజా పరిణామాలను చర్చించనున్న కేసీఆర్, దానిని యథాతథంగా అమలు చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

కరోనా కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఆర్టీసీ సేవల పునరుద్ధరణ తదితర అంశాలపైనా ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం. ఓ వైపు సడలింపులతో లాక్ డౌన్ మరింత కఠినం చేయబోతున్నారా అన్న విషయం తెలిసియాల్సి ఉంది.  ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులతో పాటు రైతు బంధు సమితి ప్రతినిధులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: