ఏపీలో తీత్లీ తుఫాన్ లేదా మ‌రో గోదావ‌రి పుష్క‌రాల ప్ర‌మాద‌మో జ‌రిగిన‌ప్పుడు సీఎం గా చంద్ర‌బాబు ఉన్నారు. చంద్ర‌బాబు ఈ రెండు ప్ర‌మాదాల గురించి త‌క్కువ‌లో త‌క్కువుగా క‌నీసం ప‌దిహేను రోజుల పాటు మీడియా అంతా త‌న మీద‌.. త‌న ప్ర‌భుత్వం మీద ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. తీవ్ర‌మైన ప్ర‌మాదం జ‌రిగి మ‌నుషులు చ‌నిపోతే 15 రోజుల పాటు చంద్ర‌బాబు దేవుడు.. వీరుడు.. సూరుడు అంటూ తెగ కీర్తించేశాయి బాబోరి అనుకూల మీడియా ఛానెల్స్‌. ఇక ప‌త్రిక‌ల సంగ‌తి స‌రేస‌రి. 

 

ఇక ఇప్పుడు కొద్ది రోజుల క్రితం విశాఖ‌లోని గోపాల‌ప‌ట్నం స‌మీపంలో ఉన్న  ఎల్జీ పాలిమార్స్ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను జ‌గ‌న్ అదే రోజు ఓదార్చారు. ఇక ప‌రిహారం కూడా ఆఘ‌మేఘాల మీద రిలీజ్ అయ్యేలా చేశారు. అంతెందుకు మామూలుగా చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ ఘ‌టన జ‌రిగితే బాబు అక్క‌డ ఓ వారం రోజులకు పైగా మ‌కాం వేసి టోట‌ల్ తెలుగు మీడియాను అంతా అక్క‌డే మోహ‌రించేసి ప్ర‌పంచం ఏదో త‌ల్ల‌కిందులు అయిపోయిన‌ట్టుగా వార్త‌లు రాయించేసి ఏదో చేయి విదిల్చిన‌ట్టు ప‌రిహారం ఇచ్చి ఏ రేంజ్‌లో ప్ర‌చారం పొందేవారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  

 

ఇక జ‌గ‌న్ జాతీయ స్థాయిలో పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా కూడా ఈ వ్య‌వ‌హారం రెండు రోజుల్లో పినిష్ చేసేశారు. తొలి రోజే భారీ ప‌రిహారం ప్ర‌క‌టించారు. మొదటి రోజు ఇంత భారీ పరిహారం చూసి షాక్ తిని గమ్మునున్న విపక్షాలు మరుసటి రోజు నుంచి తమదైన రాజకీయం మొదలెట్టారు. పెద్ద హ‌డావిడి చేస్తూ బాధితుల త‌ర‌పున పోరాటం చేస్తున్న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ల‌కు జ‌గ‌న్‌ను విమ‌ర్శించేందుకు కూడా ఛాన్స్ లేదు. జ‌గ‌న్ ఏ రెండు మూడు ల‌క్ష‌లో ప‌రిహారం ప్ర‌క‌టించి.. ఏ వారం ప‌ది రోజుల పాటు హ‌డావిడి చేస్తే వీళ్లు కూడా ఓ ప‌దిహేను రోజుల పాటు రోజూ దీనిపై నానా యాగీ చేసేవారు. దీంతో ఇప్పుడు ఏపీలో విప‌క్షాలు అన్ని జ‌గ‌న్ ఇంత స్పీడ్‌గా విశాఖ గ్యాస్ ఇష్యూ ను తెర‌మ‌రుగు చేస్తార‌ని ఊహించ లేదంటూ తెగ బాధ ప‌డిపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: