అప్పు ఇచ్చు వాడు వైద్యుడు అంటారు.. అప్పుడు తీసుకొని ఎగవేయడం గురించి ప్రస్తావన వస్తే వెంటేనే గుర్తుకు వచ్చే పేరు విజయ్ మాల్య.  పారిశ్రామికవేత్త విట్టల్ మాల్య కుమారుడైన  విజయ్ మాల్యా  యునైటెడ్ బ్రెవరీస్ గ్రూప్ ,  కింగ్ ఫిషర్ ఏర్ లైన్స్ ఛైర్మన్, యునైటెడ్ బ్రెవరీస్ గ్రూప్ యొక్క అతి ముఖ్యమైన ఉత్పత్తిగా ఉన్న బీర్ బ్రాండ్ నుంచి కింగ్ ఫిషర్ తో భారత దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు.  విజయ్ మాల్య హోటళ్ళు, ఆటోమొబైల్లు, ఫార్ములా వన్ టీం ఫోర్స్ ఇండియా, ఇండియన్ ప్రిమియర్ లీగ్ క్రికెట్ టీం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు , చిన్న ఓడ, ఇండియన్ ఏమ్ప్రేస్స్  లాంటి వాటితో చాలా లగ్జరీగా జీవితం గడిపారు. 

 

స్వదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్‌లో తల దాచుకున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మాయ మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నాడు. తాజాగా భారతీయ బ్యాంకుల్లో తీసుకున్న100 శాతం అప్పులు తిరిగి చెల్లిస్తానని, త‌న‌పై ఉన్న కేసుల‌న్నింటిని మూసివేయాలని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్‌ విజయ్‌మాల్యా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీ బాగుందని అన్నారు.

 

“ కొవిడ్‌ 19 రిలీఫ్‌ ప్యాకేజ్‌ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వాళ్లు ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వం బ్యాంకుల్లో ఉన్న నా అప్పులను 100 శాతం కట్టేస్తాను. నేను కడతానన్న ప్రతిసారి ఇగ్నోర్‌‌ చేస్తున్నారు” అని మాల్యా ట్వీట్‌ చేశారు.  కాగా, విజయ్ మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాలు పొంది 2016లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయనను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్న‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: