ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా  వైరస్ మాటే వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ముఖంలో ఈ మహమ్మారి వైరస్ భయం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకును వెళ్లదీస్తున్నారు. ఇలా రోజురోజుకు మహమ్మారి వైరస్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో... ఈ వైరస్ కి ఇప్పటివరకు విరుగుడు  కూడా లేకకపోవడం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అయితే ప్రస్తుతం కరుణ వైరస్ కారణంగా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే కరోనా  వైరస్ బారినపడి మృతి చెందినవారి మృతదేహాలకు సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరస్ సోకి మృతిచెందిన వారి మృతదేహాలలు  కూడా కరోనా  టెస్టులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా గతంలో కరోనా  వైరస్ ద్వారా మృతి చెందిన వారి శవాలకు  టెస్టులు చేయాల్సిన అవసరం లేదు అంటూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తప్పు పడుతూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్ట ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 

 

 కరోనా మృత  దేహాలకు  పరీక్షలు  నిర్వహించకపోతే థర్డ్ స్టేజ్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయని వాదనలు పిలిపించారు. కాగా  ఇప్పుడు వరకు నెల్లూరు కర్నూలు జిల్లాలో చనిపోయిన కరోనా వైరస్  పరీక్షలు నిర్వహిస్తే కరోనా వైరస్ ఉందని  బయట పడింద అంటు  పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు  కూడా ఇచ్చిన సూచనలతో  తెలంగాణ సర్కార్ ముందుకు సాగాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైకోర్టులో సమర్పించిన నివేదికపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు... కేంద్ర ప్రభుత్వం సూచించిన ఎలాంటి రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవుతున్నారు దానికి సంబంధించిన నివేదికను హై కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 26 వరకు ఒక స్పష్టమైన నివేదిక హైకోర్టు ముందు ఉంచాలి అని... చెబుతూ ఈ నెల 26కు హై కోర్టు వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: