ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, కోట్లాదిమంది శరీరాలలో ఈ వైరస్ వ్యాపించి ఉంది. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో దేశ అధ్యక్షులకు ప్రపంచ నాయకులకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటమే ముందున్న మార్గం అని చాలా దేశాలు లాక్ డౌన్ ముందు నుండి ప్రకటించి ప్రజలను ఇళ్ళకి పరిమితం చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు రవాణా వ్యవస్థ కూడా స్తంభించి పోవటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం చాలాచోట్ల ఏర్పడింది. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల ప్రపంచంలో ఉన్న పేద ప్రజలు మరియు మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఇటువంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు లాంటి న్యూస్ చెప్పింది. అదేమిటంటే కరోనా వైరస్ ఇక ఎప్పటికీ ప్రపంచంలో నుండి పోదని తెలిపింది. ఆ సంస్థకు చెందిన నిపుణుడు ఒకరు రూపొందించిన నివేదిక ప్రకారం కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు.

 

అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్‌డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ఏది ఏమైనా ఈ భూమిపై మనిషి జీవితంలో కరోనా వైరస్ ఒక భాగమై పోయినట్లు మైకేల్ ర్యాన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ కట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రపంచంలో బతికే ఛాన్స్ లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: