ప్రపంచాన్ని షేక్ చేసి పడేస్తున్నా కరోనా వైరస్ విషయంలో హైదరాబాద్ సూపర్ బ్రేక్ త్రూ సాధించింది. ఈ వైరస్ సోకిన రోగులు చికిత్స అత్యవసర వినియోగానికి అగ్రరాజ్యం అమెరికాలో డాక్టర్స్ ఉపయోగిస్తున్న ‘రెమ్డిసివిర్’ హైదరాబాదు లోనే తయారీ కాబోతోంది. ఈ మందు తయారీ కంపెనీ కోసం హైదరాబాద్ కు చెందిన హెట్రో ల్యాబ్స్ అమెరికా సంస్థ గిలీడ్‌ సైస్సెస్‌తో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా వైరస్ తో బాగా బాధపడుతున్న బాధితులకు రోగులకు బాగా ఉపశమనం ‘రెమ్డిసివిర్’ కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆహార ఔషాదా నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వటం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ దేశాలకు మేలు చేకూరుతుందని అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 

ఇక హైదరాబాద్ కు చెందిన హెట్రో ల్యాబ్స్ తో పాటు సిప్లా, మైలాన్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీలు 127 దేశాల్లో ‘రెమ్డిసివిర్’‌ ను విక్రయించవచ్చని గిలీడ్‌ సైస్సెస్ తెలియచేసింది. వీలైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా ఈ ‘రెమ్డిసివిర్’ కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు అందుబాటులోకి తేవాలని  గిలీడ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన హెట్రో గ్రూప్ సంస్థల చైర్మన్ బి. పార్ధసారథి రెడ్డి భారత్ వైద్య పరిశోధన సంస్థల నుండి అనుమతి లభించిన వెంటనే ఈ ‘రెమ్డిసివిర్’‌ను తయారీ ప్రారంభిస్తామని తెలియచేసారు.

 

‘రెమ్డిసివిర్’‌ అందుబాటులోకి వస్తే గనుక తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కరోనా వైరస్ కేసులు కట్టడి చేయడం చాలా ఈజీ అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ సోకిన రోగులకి  చికిత్స అత్యవసర వినియోగానికి ‘రెమ్డిసివిర్’‌  ఉపయోగిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో తీవ్రస్థాయిలో పాజిటివ్ కేసులు ఊహించని విధంగా నమోదు అవుతున్నాయి. ‘రెమ్డిసివిర్’‌ అనుకున్న టైం కంటే ముందే వస్తే చాలా వరకు తెలంగాణ లో వైరస్ అరికట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: