ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కాటేస్తుంది. ఎక్కడో చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న ఈ మాయదారి మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడ గడలాడిస్తుంది.  లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి..  రెండు లక్షల చేరువలో మరణాలు సంబవించాయి.  ఇక ప్రపంచంలో మూడో వంతు దాదాపు 70 వేల మరనాలు ఒక్క అమెరికాలోనే జరిగాయింటే దీని ఉద్రితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.  ఇక మన దేశంలో కరోనా వ్యాప్తి మొదలు పెట్టినప్పటి నుంచి లాక్ డౌన్ విధించారు.  ఆ నాటి నుంచి వలస జీవుల పరిస్థితి మాటల్లో చెప్పలేం.. ఆకలితో అలమటిస్తున్నారు.

 

ఐనవారు దూరమైన.. చేయాలంటే పని లేక బయటకు వెళ్లలేక చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలికి పిల్లా పెద్దా తట్టుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. పొట్టకూటి కోసం స్వస్థలాలను వదిలి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తరలిపోయిన వలస జీవుల పట్ల లాక్ డౌన్ పెను విఘాతంలా పరిణమించింది. ఉన్నచోట ఉపాధి లేక, సొంత ఊరికి వెళ్లే మార్గం లేక ఇన్నాళ్లు తల్లడిల్లిపోయారు.  సహాయం అందితే ఒకే అందని వారి పరిస్తితి దారుణంగా తయారైంది.  ఈ సమయంలో ఓ తల్లి తన చంటి పిల్లాడిని వడిలో పెట్టుకొని ప్రాణాలకు తెగించి రెండు బోగీల మద్య ప్రయాణం చేసింది.  

 

ఈ వీడియో చూస్తుంటే అయ్యో ఈ కరోనా మహమ్మారి తగలెయ్య ఎప్పుడు పోతుందో అని బాధకలుగుతుంది.  ఈ వీడియో చూసి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ కుమార్ తీవ్రంగా చలించిపోయారు. ఎంత కష్టమొచ్చింది తల్లీ నీకు అంటూ నిలువునా కదిలిపోయారు. నీ అవస్థ చూసి నా మనసు తల్లడిల్లిపోతోంది. ఎందుకీ అభివృద్ధి, ఎందుకీ సంపద? నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగడంలేదు. అన్నీ ఉన్నా నీకేమి చేయలేకపోతున్నా. నన్ను క్షమించు తల్లీ! అంటూ తీవ్ర ఆవేదనతో కూడిన ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: