ప్రస్తుత కాలంలో మహిళలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న క్రూర మృగాలు.. అలాగే వారితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి అమ్మాయిలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని మహారాజ్ ‌గంజ్  జిల్లాకు చెందిన ఒక యువకుడు యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె ఏకాంతంగా గడిపిన సమయంలో సెల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు.

 

 ఇంకా ఏముంది ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరించాడు.  ఇది ఇలా ఉండగా ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. మల్లి కొద్దీ రోజులుగా ప్రియురాలిని యువకుడు లైంగిక కోరికలు తీర్చకపోతే వీడియోలను బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు.


ఇలా ఎంత బెదిరించిన కూడా ఆ యువతి ఒప్పుకోక పోయేసరికి ఆ కామాంధుడు మరింతగా రెచ్చిపోయి, ఆ యువతి పరువు తీయాలన్నా నేపథ్యంలో ఏకాంతంగా వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ యువతి మనస్థాపానికి చెంది పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ సంఘటన పై పోలీసు అధికారులు ఎటువంటి స్పందన లేకపోవడంతో మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనితో పోలీస్ అధికారులకు దిమ్మతిరిగి నిందితులపై అత్యాచారం, బ్లాక్ మెయిల్ బెదిరింపులు సహా సైబర్ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. 


ఇకపోతే ప్రస్తుతానికి మాత్రం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి పనులు ఈ మధ్య దేశంలో మరీ ఎక్కువ అవుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసిన కొందరు అసలు మారడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: