కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ కట్టు దిడ్డంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కూడా నేరాలు ఘోరాలు జరుగుతూ వస్తున్నాయి.  ఇకపోతే లాక్ డౌన్ లో ప్రజలు ఎక్కడ తిరగలేదని తెలుస్తుంది.. దీంతో అన్నీ రకాల సంస్థలు మూత పడ్డాయి . అయితే ఇప్పుడు కరోనా సోకడం వల్ల అక్కడ వారిని క్వారంటైన్ కు తరలించారు.  కరోనా సోకిందంటే దాదాపు గా చావు కు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు అని తెలుస్తుంది..




కరోనా కష్టకాలంలోనూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఏకంగా కరోనాతో చనిపోయిన మహిళ ముక్కుపుడకను మాయం చేసేశారు. కంటికి కనిపించని వైరస్ ఎక్కడ సోకుతుందోనని జనం బెంబేలెత్తిపోతుంటే.. కరోనాతో చనిపోయిందని తెలిసి కూడా ఆమె ముక్కుపుడక, చెవిదిద్దులు మాయం చేయడం విస్మయానికి గురిచేసింది. మృతురాలి ఒంటిపై ఉండాల్సిన బంగారం కనిపించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.




నగరంలోని అమ్రాయ్‌వాడి ప్రాంతానికి చెందిన బిందు రాజ్‌పుత్(50)కి కరోనా సోకడంతో కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రిగా మార్పు చేసిన సివిల్ ఆస్పత్రిలో చేరింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు విడిచింది. అయితే ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులకు షాకింగ్ విషయం కంటపడింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఆమె సెల్‌ఫోన్ ఆస్పత్రిలో చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు. మృతురాలి భర్త శివ్‌పుజన్ రాజ్‌పుత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.






అయితే, ఆమె శరీరానికి ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదని తెలిసింది..ముక్కుపుడక చోరీకి గురైనట్లు చెప్పారు. అలాగే ఆమె సెల్‌ఫోన్ కూడా కనిపించలేదని.. చార్జర్‌తో సహా దొంగిలించినట్లు పేర్కొన్నారు. కరోనా మృతుల ఒంటిపై బంగారం.. వారి విలువైన వస్తువులు ఆస్పత్రిలో చోరీకి గురికావడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ ఒక మహిళ ఒంటిపై ఉన్నబంగారం చోరీ చేశారన్నారు. అయితే భార్య మరణంతో షాక్‌ తిన్న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు... రాను రాను మన సమాజం ఎలా తయారవుతుంది అంటే..

మరింత సమాచారం తెలుసుకోండి: