సాధారంగా ఎవరైనా ట్యాక్సీ ఎక్కితే మీటర్ ఎంత తిరుగుతుందో దాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. ఆటో, ట్యాక్సీ లేదా ఇతర వాహనాలు ఏవైనా మనం ఎంత దూరం ప్రయాణిస్తామో ఆ మేరకు డబ్బులు చెల్లిస్తుంటాం.  ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కొన్నిచోట్ల ప్రైవేట్ వాహనదారులు అందినంత డబ్బు దోచుకుంటున్నారు. సాధారణంగా ఏదైనా వాహనం ఎక్కితే.. రూ.100, రూ.200, రూ.500.. మహా అయితే రూ.1000, రూ.2000. అయితే ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా కొంత మంది ప్రైవేట్ వాహనదారులు డబులు.. త్రిబుల్ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.  మొన్నటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నవారు స్వస్థలాలకు రావాలంటే ఎంతోడబ్బు ఖర్చుచేసుకొని మరీ రావడం జరిగింది. ఈ మద్య కేంద్రం వసల కార్మికుల వెసులు బాటు కల్పించింది.. దాంతో రైళ్లు, బస్సు ఏర్పాటు చేశారు.

 

 

అయితే ఇప్పుడు ట్యాక్సీ ఎక్కితే రూ.10,000 వేలు కట్టాల్సిందే. ఇది ఏ ప్రైవేల్ వాహనదారు చేస్తున్న వసూళ్లు కావు.. ట్యాక్సీ ఎక్కాలంటే రూ.10,000 చెల్లించాల్సిందేనంటోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఢిల్లీ విమానాశ్రయం నుంచి యూపీలోని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాలకు ట్యాక్సీలో వెళ్లాలనుకునే ప్రయాణికులు అక్షరాలా రూ.10వేలు చెల్లిచాల్సిందేనని యూపీఎస్‌ఆర్‌టీసీ ప్రకటించింది. అదే ఎస్‌యూవీలో ప్రయాణించాలనుకుంటే మరో రూ.2వేలు అదనంగా చెల్లించాలని చెప్పింది. 

 

ఇది 250 కిలోమీటర్లు, ఆపైన ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు ఈ ధరలు చెల్లించేందుకు సిద్ధపడాలని సూచించింది.  అంతే కాదు బస్సు చార్జీలు కూడా పెంచే యోచనలో ఉందట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి 100 కిలోమీటర్లకు నాన్ ఏసీ బస్సు టికెట్‌కు రూ.1000, ఏసీ బస్సుకు రూ.1,320 చెల్లించాలని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్లకు లేఖల ద్వారా ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అధికారులతో తర్జన భర్జన  కొనసాగుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: