విజయ్ మాల్యాకు బ్రిటన్ లో ఊహించని షాక్ తగిలింది. తనను భారత్ కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ విజయ్ మాల్యా వేసిన పిటిషన్ ను యూకే కోర్టు తిరస్కరించింది. దీంతో విజయ్ మాల్యాను త్వరలోనే బ్రిటన్ భారత్ కు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే మాల్యా.. రుణాలు తీర్చేస్తానని, కేసులు ఎత్తేయాలని భారత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 

 

బ్రిటన్లో ఉంటున్న విజయ్ మాల్యాకు యూకే కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను ఇండియాకు అప్పగించాలని లండన్ హైకోర్టు నిర్ణయించడంతో.. దాన్ని సవాలు చేస్తూ.. విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ కు కూడా కోర్టు నిరాకరించడంతో.. మాల్యాను ఇండియాకు అప్పగించడానికి మార్గం సుగమమైనట్టే కనిపిస్తోంది. 24 రోజుల్లో బ్రిటన్ మాల్యాను ఇండియాకు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు కేంద్రం కోవిడ్ ప్యాకేజీకి కంగ్రాట్స్ చెప్పిన మాల్యా.. తాను అప్పులు తీర్చేస్తానని, తనపై కేసులు ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. విజయ్ మాల్యా బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టడంతో పాటు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. విజయ్ మాల్యా స్కామ్ విలువ 9 వేల కోట్లుగా ఉంది. 

 

భారతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు 100 శాతం తిరిగి చెల్లిస్తానన్న తన ప్రతిపాదనను ప్రభుత్వం మన్నించాలని ఇప్పటికే విజయ్‌ మాల్యా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. బకాయిలు తీసుకొని తన మీద ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీపై అభినందనలు తెలియజేస్తూ, తన విన్నపాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని వాపోయాడు. ప్రభుత్వం కావాలంటే ఎన్ని నోట్లు అయినా ముద్రించగలదని, కానీ తన విన్నపాన్ని మాత్రం విస్మరిస్తున్నారని మాల్యా ట్వీట్ చేశాడు. 

 

విజయ్ మాల్యా భారత్‌ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి.. 2016లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన్ను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్‌ను ఆ కోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అక్కడా చుక్కెదురు కావడంతో.. మాల్యా అప్పగింత లాంఛనమే కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: