దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కేంద్రం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా కేంద్రం కేంద్ర ఉద్యోగుల కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇకపై కేంద్ర ఉద్యోగులు సంవత్సరంలో 15 రోజులు ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. కేంద్రం తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 
 
ఈ నిర్ణయంతో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రం కేంద్ర సచివాలయంలో సామాజిక దూరం పాటించడంతో పాటు పని వేళల్లో మార్పులు చేయనుందని తెలుస్తోంది. కేంద్రం అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాల్లో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రంలోని 75 మంత్రిత్వ శాఖలు డిజిటల్ వేదికగా రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించాయి. 
 
కేంద్ర హోం శాఖ తాజాగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించడంతో ఆయా మంత్రిత్వ శాఖల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ మరియు ఇతర మంత్రిత్వ శాఖలను వీఐపీ ప్రశ్నల సమయంలో ఒక మెసేజ్ ద్వారా అలర్ట్ చేసే విధంగా ఒక వ్యవస్థను రూపొందించినట్టు తెలుస్తోంది. ఛైన్ ఆఫ్ కమాండ్ వ్యవస్థ ద్వారా ఫైల్ ను ప్రాసెస్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
 
అధికారులు ఇకపై అధికారిక సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నినటివరకు 78,003 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 26,235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,549 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఈరోజు 36 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా కేసుల సంఖ్య 2100కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 41 కేసులు నమోదు కావడంతో కరోనా కేసుల సంఖ్య 1367కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: