కేరళ కథ మళ్ళీ మొదటికొచ్చేలానే కనిపిస్తుంది. నాలుగు రోజుల క్రితం వరకు జీరో కేసులు నమోదయిన ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇవాళ ఒక్క రోజే అక్కడ  26 పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి. గత నెల రోజుల నుండి సింగిల్ డే లో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ 26 కేసుల్లో14 కేసులు విదేశాల నుండి వచ్చినవారివే కావడం గమనార్హం. ఈ కొత్త కేసులతో కలిపి కేరళ లో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 560కి చేరింది. అందులో ప్రస్తుతం 64కేసులు యాక్టీవ్ గా ఉండగా ముగ్గురు మరణించారు. 493 మంది బాధితులు  కోలుకున్నారని సీఎం విజయన్ వెల్లడించాడు. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక లో ఈరోజు కొత్తగా 22 కేసులు నమోదు కాగా తమిళనాడు లో ఈరోజు  మరో 447 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా  ఈరోజు మరో 36కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2100కు చేరింది. అందులో ఇప్పటివరకు  48మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈరోజు తెలంగాణకు సంబందించిన హెల్త్ బులిటెన్   ఇంకా విడుదలకావాల్సి వుంది అయితే గత కొన్ని రోజుల నుండి ఆక్కడ కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: