రాజకీయాలలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయాలను శాసించే సామర్ధ్యం ఉంది. ఇదే సమయంలో బలమైన మీడియా కూడా చాలా వరకూ చంద్రబాబు కి సపోర్ట్ గా ఉంది. అయినా గాని అటువంటి చంద్రబాబుని జగన్ దెబ్బ తీయడం జరిగింది. నోటి మాట రాకుండా చంద్రబాబు విలవిలలాడి పోయే విధంగా దెబ్బ ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ ఎవరికీ అర్థం కాని వ్యూహాలతో దూసుకుపోతుంటే చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అధికారంలో ఉన్న టైంలో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడికి.. జగన్ తాజాగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారట. ఇటీవల జగన్ సర్కార్ రిలీజ్ చేసిన 203 జీవోపై చంద్రబాబు ని పూర్తిగా డిఫెన్స్ లోకి జగన్ నెట్టారట.

 

రాష్ట్ర ప్రయోజనాల కంటే మరేదీ ముఖ్యం కాదని పోతిరెడ్డిపాడు నీటి విషయంలో జగన్ నిరూపించుకోవడం జరిగింది. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీటి ని తీసుకుపోయి జీవో విషయంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి, జనసేన అధినేతలు నోరు మెదపకుండా చేసింది. దీంతో ఈ విషయంలో జగన్ ని వారు విమర్శించ లేకుండా పరిస్థితి ఏర్పడింది. దీంతో బహిరంగంగా జగన్ పై విమర్శలు చేయలేని పరిస్థితి ప్రతిపక్షాలకు ఏర్పడింది. మరోపక్క జగన్ కి సోషల్ మీడియా నుండి నెటిజన్లు నీరాజనలు పలుకుతున్నారు.

 

అయితే ఈ విషయంలో తెలంగాణ నేతలు మరియు కొంతమంది నాయకులు విమర్శలు చేస్తున్న సమయంలో ప్రజల నుండి అదేవిధంగా సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి చంద్రబాబు నోరు ఓపెన్ చెయ్యి  అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబు పార్టీ నాయకులతో మాట్లాడటం జరిగిందట. కావాలని వైఎస్ జగన్ కెసిఆర్ ఈ విషయంలో నాటకాలాడుతున్నారని అంటున్నారట. మొత్తంమీద చూసుకుంటే పోతిరెడ్డిపాడు విషయంలో చంద్రబాబుకి నోరు తెరవకుండా జగన్ అదిరిపోయే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: