అదేంటి ప్రధాని మోడీ దేశానికి నాయకుడు. ప్రపంచ నాయకుడుగా ఉంటున్నాడు. పన్నెండేళ్ళ పాటు గుజరాత్  సీఎంగా ప‌నిచేసిన ఘనాపాటి, ఆరేళ్ళుగా దేశానికి నాయకత్వం వహించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక రెండు సార్లు ఫుల్ మెజారిటీ, భారీ అధిక్యతతో బీజేపీకి కనీ వినీ ఎరగని విజయాలని అందించిన మహా యోధ. అటువంటి మోడీ ఏ విషయంలో జగన్ కంటే వెనకబడ్డారు అన్న డౌట్లు రావచ్చు.

 

అయితే పేదలకు సాయం చేయడంలో చూసుకుంటే మోడీ ఆర్భాటంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల  భారీ ప్యాకేజి కంటే కూడా జగన్ ఏపీలో పేదలకు  నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్న సొమ్ము బాగుందని అంటున్నారు. మోడీ ఆలోచనలు ఏమైనా కూడా పధకాల  మీద డబ్బు పెడెతే పేదవాడి పొట్ట నిండదు అంటున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో పేదల ఇంట్లో పొయ్యి మీద నుంచి లేవదు. అటువంటి వేళ వారి జీతాలు పెంచుతాం, ఉపాధికి హామీ ఇస్తాం. కనీస వేతనాలు అమలు చేస్తాం అని చెబుతున్నారు.

 

ఇవన్నీ కూడా భారీ ప్యాకేజిగా రూపకల్పన చేస్తున్నారు. బాగానే ఉంది కానీ ఇపుడు దేశం ఎన్నడూ లేనంత ఇబ్బందులో ఉంది. ఓ విధంగా దేశంలో ఆర్ధిక ప్రగతి ఆగిపోయింది. ఈ దేశంలో  నగదు చలామణీ ఆగిపోయింది. నూటికి తొంబై శాతం పేదలు ఉన్న ఈ దేశంలొ వారి చేతిలోకి నోటు వస్తే అది చలామణీ అయి మర్కెట్ లోకి వస్తుంది.ఆ విధంగా దేశ   ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడుతుంది.

 

అందువల్ల తక్షణం పేదలు, మధ్యతరగతి ఖాతాల్లో నగదు వేస్తే బాగుండేది. కెనడాలో అలాగే చేశారు. అనేక ఇతర దేశాల‌లో నేరుగా పేదలకు డబ్బు పంపిణీ చేశారు. కానీ భారత్ లో మాత్రం మోడీ భిన్నగా వ్యవహరించారు. కర్మాగారాలకు పరిశ్రమలకు రాయితీలు అంటున్నారు. బ్యాంకు రుణాలు అంటున్నారు.

 

అవన్నీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడ్డాక చేయాల్సినవి. పైగా సామాన్యుడు ఇంటి నుంచి కదలాలి. అంటే అతని ఆక‌లి తీరాలి. కర్మాగారానికి వెళ్లాలన్నా కూడా బలం కావాలి. ఉచిత రేషన్ అంటున్నారు. కేవలం రేషన్ సరకుతోనే ఇల్లు  గడచిపోతుందా. కనీసం ప్రతీ ఇంటికీ పది వేల రూపాయలు వంతున అయినా  మూడు నెలల పాటు సొమ్ము వేస్తేనే తప్ప ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడదు, 

 

మిగిలిన పధకాలు, రాయితీలు అన్నీ బాగున్నాయి, కానీ మోడీ సర్కార్ తక్షణం పేదలు, మధ్య తరగతి ఖాతాల్లో సొమ్ము వేయకపోవడం వల్ల ఇవేమీ పడిపోయిన ఆర్ధిక రధాన్ని పరుగులు ఎత్తించలేవు. అదే విధంగా యజమానులకు లాభం కలిగిస్తే కార్మికులకు మేలు జరుగుతుంది అన్న పాతకాలం విధానాలే ఈ విపత్తు వేళ కూడా అనుసరించడం దారుణమే.  మొత్తం మీద జగన్ అమ్మ ఒడి అంటున్నారు, రైతు భరోసా అంటున్నాడు, అలా వారి ఖాతాల్లో నగదు ఇస్తున్నాడు.

 

 కరోనాతో వచ్చిన మొదటి లాక్ డౌన్లోనే కోటీ యాభై లక్షల రేషన్ కార్డులదారులకు ఒక్కొక్కరికీ వేయి రూపాయలు నగదును జగన్ పంపిణీ చేశారు. మరి దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఆ పనిచేయలేరా అని అంతా అంటున్నారు.మొత్తానికి మోడీ ఇతర దేశాలను అయినా ఆదర్శంగా తీసుకుని హెలికాప్టర్ మనీని తెచ్చి అందరికీ పంచాలన్న డిమాండ్ ఇపుడు పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: