రోజులు గడుస్తున్నా దేశం లో కరోనా ప్రభావం ఎక్కువతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 3920కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహారాష్ట్ర లో 1602 ,పంజాబ్ 447, గుజరాత్ 324, ఢిల్లీ 472, ఒడిశా  101, పశ్చిమ బెంగాల్ 143 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా నిన్నటి వరకు ఇండియాలో 80000కేసులు నమోదు కాగా అందులో 27956మంది బాధితులు కోలుకోగా 2649 మంది మరణించారు. ప్రస్తుతం 51367కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజుతో  కరోనా కేసుల్లో భారత్,  చైనా ను దాటేయనుంది. చైనా లో మొత్తం 82000కేసులు నమోదయ్యాయి.
 
ఇక మరో రెండు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది. ఆతరువాత మే 18నుండి నాలుగో దశ  లాక్ డౌన్ మొదలుకానుంది అయితే ఈ లాక్ డౌన్ ఎన్ని రోజుల్లో కొనసాగుతుందో స్పష్టత లేదు. మరో వైపు జూన్ 30వరకు సాధారణ రైళ్లు నడువవని రేల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం వలస కూలీలను తరలించడానికి  మాత్రం స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతుంది. దాంతో ఆయా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 36కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2100కు చేరింది. అందులో ఇప్పటివరకు 48 మరణాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ లో మరో 47 కేసులు నమోదయ్యాయి దాంతో మొత్తం కేసుల సంఖ్య  2000 కు చేరింధీ అందులో ప్రస్తుతం 952మంది బాధితులు కోలుకోగా 34 మంది మరణించారు. ప్రస్తుతం 428కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: