తాజాగా విశాఖ‌లో జ‌రిగిన గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై సీఎం జ‌గ‌న్ స్పందించిన తీరుని చూసి ఇప్పటి వరకూ ప్రభుత్వం చెప్పే మరియు చేసే ప్రతి దానికీ.. ఎడ్డం అంటే తెడ్డెం అనే నాయ‌కులుగా పేరు తెచ్చుకున్న ది గ్రేట్ కామ్రెడ్స్ సైతం ఫిదా అయ్యారు. ఇంత‌క న్నా ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తార‌ని.. సీపీఐ పార్టీ నాయ‌కుడు నారాయణే అభిప్రాయ‌ప‌డడం గమనార్హం. ఇక‌, రాష్ట్ర చీఫ్ రామ‌కృష్ణ కూడా ఏమీ విమ‌ర్శలు చేయ‌లేదు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన కోటి రూపాయ‌ల ప‌రిహారంతో కామ్రేడ్లకు నోట మాట‌లేదు. ఇప్పటి వరకూ దేషంలో రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత మొత్త ఒక్క బాధితుడికీ ఇవ్వలేదు.

 

అయితే చంద్రబాబు మాత్రం కూసింత విచక్షణ లేకుండా జగన్ కోటి రూపాయలు ఇచ్చిన దానిపై కూడా తీవ్రమైన విమర్శలు చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డబ్బులు ఇస్తే సరిపోదు అంటూ కొత్త పల్లవి అందుకున్న బాబు ప్రభుత్వం స్పందించడం కాదు పరిశ్రమ స్పందించేలా చేయాలని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

చంద్ర‌బాబు పాల‌న‌లో ఏర్పేడులో ఇసుక త‌వ్వకాల నేప‌థ్యంలో హ‌త్యలు, గోదావ‌రి పుష్కరాల తొక్కిస‌లాట‌లో బాధితుల‌కు ఇచ్చిన ప‌రిహారం త‌క్కువ‌న్న అభిప్రాయం ఉంది. అది కూడా స‌రిగా ఇవ్వలేదు. నెల‌ల త‌ర‌బ‌డి బాధుతుల ఎన్నో ఇబ్బందుల‌కు గుర‌య్యారు.

 

ఇక ఇప్పుడు విశాఖ అదే స‌మ‌యంలో కంపెనీ నుంచి వ‌చ్చేదీ రానిది ప‌క్కన పెడితే.. జ‌గ‌న్ ప్రభుత్వం వెంట‌నే స్పందించి కోటి న‌ష్ట ప‌రిహారం ప్రక‌టించింది. వెంటనే చెల్లించింది కూడా. దీనిని కూడా ఏమీ చేయ‌న‌ట్టుగా ప్రొజెక్టు చేయ‌డాన్ని చూస్తే.. చంద్రబాబు క‌న్నా కామ్రేడ్లు బెట‌ర్ అనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: