ఆంధ్రప్రదేశ్ లో కరోనా నిర్థారణ టెస్టుల సం ఖ్య పెంచిన తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీనిని బట్టి ఏపీ సర్కార్ కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో మంచి పరిణితి చూపించి గణణీయమైన మార్పుని సొంతం చేసుకుంది అనే చెప్పొచ్చు. ముందు నుండి భారీగా టెస్టులు చేపట్టడమే ఈ మంచి ఫలితాలకి కారణం అని చెప్పాలి.

 

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదయ్యాయి. మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2100కు చేరుకోగా... కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1192కు చేరింది. వైరస్ కారణంగా ఏపీలో ఇప్పటివరకు 48 మంది చనిపోయారు.

 

అలాగే కోలుకున్న వారి సంఖ్య కూడా బాగా మెరుగుపడింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో గుంటూరు 21, కర్నూలు 19, అనంతపురం 3, చిత్తూరు 3, పశ్చిమ గోదావరి 2, కృష్ణ, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు

 

ఇక తెలంగాణ విషయానికి వస్తేహై కోర్టు టెస్టుల సంఖ్య పెంచమని ఆదేశించిన తరువాత భారీగా కేసులు నమోదు కావడం గమనార్హం. ముందు కేసీఆర్ అనుమానితులకే మేం టెస్టులు చేస్తాం.. ఆంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరించితీరు మొదటికే మోసం తెచ్చింది. టెస్టులు లేక సింగిల్ డిజిట్ లో నమోదైన కేసులు కాస్తా ఇప్పుడు భారీగా పెరిగాయి.

 

గురువారం కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 47 కేసులను గుర్తించినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో వివరించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1414కు చేరుకున్నాయి. గురువారం కరోనా నుంచి కోలుకొని 13 మంది డిశ్చార్జి అయ్యారు.

 

గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. జీహెచ్ఎంసీలో 40 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఐదుగురికి, మరో ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకింది. కావున జగన్ చేసిన పనిని కేసీఆర్ ఆలస్యంగా చేయడం వల్ల తెలంగాణలో సీన్ రివర్స్ అయింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: