కరోనా పేరు వింటేనే కంటికి కనిపించకుండా దాక్కుంటున్న రోజులు.. అంతే కాకుండా పొరబాటున దగ్గినా, తుమ్మినా దొంగలా చూస్తున్నారు.. అనుమానిస్తున్నారు కూడా.. మరి కొందరైతే చాటుగా అధికారులకు ఫోన్ కూడా చేసి చెబుతున్నారు.. ఒక రకంగా ఇప్పుడున్న పరిస్దితుల్లో ఈ వైరస్ ఎటువైపునుండి దాడి చేస్తుందో అనే భయంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ఇక దీని నుండి కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలు పాటించడం ఒక్కటే మనముందున్న మార్గమని తెలుసుకున్న కొందరు, ప్రాణాల మీద తీపి ఉన్న వారు అపురూపంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు..

 

 

ఇలాంటి కనిపించని భయంకరమైన పరిస్దితుల్లో కావాలని కరోనాను తగిలించుకునే వారుంటారా..? ఉండరని మీరంటారు.. కానీ ఉన్నారు.. మాకు కరోనా అంటించండిరా బాబు అంటూ మరి ఎగబడి కరోనా అంటించుకుంటున్నారు.. అంతే కాదు ఈ వైరస్ అంటించుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని పాటిస్తున్నారు.. ఎక్కడ అనుకుంటున్నారా.. అగ్రరాజ్యం అమెరికాలో.. ఇప్పటికే ఈ దేశం కరోనాతో అల్లాడి పోతుంది. ఈదశలో ఈ రాజ్యంలో ఉన్న జైళ్లలో ఖైదీల్ని తాత్కాలికంగా విడుదల చేసేలా నిర్ణయం తీసుకుంది ఇక్కడి ప్రభుత్వం.. ఇందులో భాగంగా లాస్ ఎంజెల్స్ కౌంటీ జైలు అధికారులు కొంతమంది ఖైదీల్ని విడుదల చేశారు.. మరి మిగతా ఖైదీలు ఊరుకుంటారా మమ్మల్ని కూడా విడుదల చేయాలని ఆందోళనకు దిగారు..

 

 

అంతటితో ఆగలేదు.. జైళ్ళో ఒకరు ధరించిన మాస్క్ లు మరొకరు ధరించడం, ఒకరు తాగిన నీళ్లను మరొకరు తాగడం ఇలా.. ఏం చేస్తే కరోనా సోకుతుందో అన్నీ వెధవ పనులు చేస్తూ, మొత్తానికి ఒక 30 మంది ఖైదీలు కరోనాను అంటించుకున్నారు.. ఇకపోతే కరోనా సోకితే తమని విడుదల చేస్తారని భావించిన ఖైదీలు ఇలా ప్రవర్తించారు.. కాగా చట్ట విరుద్దంగా కరోనా ను వ్యాప్తి చేసేందుకు కుట్ర చేస్తున్నారనే నెపంతో వారిపై అదనంగా కేసులు నమోదు చేశారు అధికారులు..

మరింత సమాచారం తెలుసుకోండి: