ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తుంది ఎంతోమందికి శర వేగంగా వ్యాప్తి చెందుతూ మృత్యువుతో పోరాడేలా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది ప్రజలు ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన తర్వాత ఏం చేస్తారు... వైరస్  బారిన పడితే  ఇంకేం చేస్తాం ఐసోలేషన్ వార్డులో  భయం భయంగా చికిత్స తీసుకుంటూ ఉంటాం అని అంటారు ఎవరైనా . కానీ ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు మాత్రం అలా చేయలేదు. మహమ్మారి వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నప్పటికీ... తమ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధిస్తూ నే ఉన్నాడు ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు.

 

 

 ఉపాధ్యాయుడు పట్టుదలను చూసి మాజీ స్టార్ క్రికెటర్ అయిన వివిఎస్ లక్ష్మణ్ సైతం ఫిదా అయిపోయాడు. అతని  పట్టుదలను స్ఫూర్తిని ఎంతగానో అభినందించారు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. వివరాల్లోకి వెళితే... కేంద్రపాలిత ప్రాంతమైన లడక్లోని లెహ్ కు చెందిన ఖైపాయత్ హుస్సేన్  ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉంటాడు. కాగా ఇటీవలే కరోనా బారిన  పడ్డ  అతడు ఐసొలేషన్  వార్డుకు తరలించారు. ఐసోలేషన్ వార్డు నుంచి ఆన్లైన్ ద్వారా  విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ప్రారంభించాడు . విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు పట్టుదల స్ఫూర్తికి ఏకంగా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యి ఆయన పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. 

 

 

 లేహ్  ప్రాంతానికి చెందిన ఖైపయత్  హుస్సేన్ అనే వ్యక్తి మ్యాథ్స్ టీచర్ అని... కరోనా వైరస్ బారిన పడినప్పటికీ పట్టుదలతో   విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈయన  పట్టుదల స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అంటూ పేర్కొన్నాడు మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. తాజాగా వివిఎస్ లక్ష్మణ్ పెట్టిన పోస్ట్ క్లాస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కరోనా  వైరస్ నేపథ్యంలో... విద్యా సంస్థలన్నీ మూసివేయడంతో విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడిపోయింది. 

 

 

ఒకవేళ విద్యాసంస్థలు మూసివేసిన ఇప్పటికీ ఏదైనా అదనంగా ఉపయోగపడే కోర్సులైన నేర్చుకుందామా అంటే కోచింగ్ సెంటర్లు కూడా మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో ఆన్లైన్ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు ఏకంగా కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నప్పటికి కూడా... విద్యార్థుల భవితవ్యం కోసం ఆన్లైన్ పాఠాలు బోధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి స్ఫూర్తినిస్తున్నారు అంటు  ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ  టీచర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: