ఈ ప్రపంచంలో మార్పురానివి అంటూ ఉన్నాయంటే అవి పంచ భూతాలే అని చెప్పక తప్పదు.. ఏ స్వార్ధం లేకుండా, ఎవరి నుండి ఏది ఆశించకుండా తమపని తాము చేసుకుంటూ వెళ్లుతున్నాయి.. ఇక మనిషి జీవనాధారానికి మూలకారణమైన ప్రకృతిలోనే స్వార్ధం లేనప్పుడు.. పుట్టి చచ్చే మనిషికి ఎందుకింత స్వార్ధమో ఇప్పటికి ఏ శాస్త్రజ్ఞుడు కనిపెట్టలేక పోయాడు.. ఇదిలా ఉండగా ఒకవైపు కరోనా వచ్చి బ్రతుకులన్ని కాళరాత్రిలో కలిసిపోతున్నాయి.. ఇలాంటి సమయంలో నేరాలు కూడా పెరుగుతున్నాయి.. లోకంలో కామాంధులు మానసిక వికలాంగులను, పసి పిల్లలను, ఇలా ఎవరిని కూడా వదలడం లేదు.. అక్రమ సంబంధాలు కూడా ఆగడం లేదు.. మొత్తానికి తెలిసేది ఏంటంటే ఈ లోకంలో ఏది లేకున్న బ్రతకవచ్చు.. కానీ కామాన్నీ తీర్చుకోలేకుండా ఈ మనిషి అనే జంతువు బ్రతకలేడని అర్ధం అవుతుంది..

 

 

క్షణిక సుఖం కోసం ఆరాటపడి ఇంకా కొన్నాళ్ళు బ్రతకవలసిన జీవితాన్ని పణంగా పెడుతున్నాడు.. అయినా విలువలు తప్పిన మనిషికి, ఎంత చెప్పిన మార్పు రాదని, రాను రాను లోకంలో మనుషుల కంటే రాక్షాసులే మిగులుతారని సంకేతాలు ఇస్తున్నాడు.. ఇకపోతే కామం చాటున మోహం.. మోహం చాటున మోసం.. మోసం చాటున కౄరత్వం దాగుందనే విషయాన్ని ఈ సంఘటన నిరూపిస్తుంది.. అదేమిటంటే.. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ కు చెందిన ఆంజనేయులు (22).. అదే గ్రామానికి చెందిన బాలమ్మ అనే మహిళతో రెండేళ్లుగా అక్రమ సంబంధం నడిపిస్తున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి, ఇద్దరిని మందలించి, ఆంజనేయులుకు పెళ్ళిచేస్తే అయినా మారుతాడని భావించి, అతని మేనమామ కూతురితో వివాహం చేసేందుకు నిర్ణయించారు..

 

 

కాగా పెళ్లి విషయాన్ని వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు. దాన్ని మనుసులో పెట్టుకున్న ఆ ప్రియురాలు అతనితో కలిసి ఫుల్‌గా మద్యం తాగి పెళ్లి విషయంలో గొడవకు దిగింది.. అప్పటికే అతని ఎడబాటును సహించలేని ఆమె ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి, ఇంట్లో ఉన్న కత్తితో ఆంజనేయులు గొంతు కోసి చంపింది. ఆ తర్వాత గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టి ఇంటి సమీపంలో ఎస్‌బీఐ బ్యాంకు పక్కన ఉన్న డ్రైనేజీ కల్వర్టులో పడేసింది... చూశారా పెళ్ళి చేసుకుని హాయిగా గడపవలసిన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: