కరోనా ప్రపంచ దేశాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు షాక్‌ ఇస్తోంది. అసలు ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం  జరుగుతాయా లేదా అనే సందేహం ఒకటైతే, కరోనా కారణంగా ట్రంప్‌ ఓడిపోయే ఛాన్సుందనేది మరో విషయం. 

 

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే  ఓ ఏడాది కాలం పాటు సాగే తంతు. షెడ్యూలు ప్రకారం అయితే వచ్చే నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఓ దశలో ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ తరుణంలో కరోనా ఒక్కసారిగా కబళించటంతో ఈక్వేషన్లన్నీ మారిపోయాయి. 

 

ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలకు చేరువలో కరోనా కేసులుంటే, అందులో ఒక్క అమెరికాలోనే దాదాపు 15లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దాదాపు లక్షకు చేరువలో మరణాలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా కొన్ని దశాబ్దాల తర్వాత అత్యంత గడ్డుకాలాన్ని చూస్తోంది. కరోనా కబళించటంతో ఇప్పటికే నిరుద్యోగం 20శాతానికి చేరువలో ఉంది. ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతూ, అన్ని రంగాలూ పడకేసిన తరుణంలో రాబోయే ఎన్నికల పరిస్థితేంటినే ప్రశ్న తలెత్తుతోంది.

 

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ నుండి మెల్లగా సడలింపుల దిశగా ఉన్నాయి. ఓ పక్క ఆంక్షలు సడలుతున్నా పెరిగే కేసులతో ప్రజల్లో భయాందోళనలు తొలగిపోలేదు. అదే సమయంలో కరోనాను ట్రంప్ డీల్ చేసిన తీరుపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కారణాలన్నీ కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా అనే సందేహానికి కారణమౌతున్నాయి. 


అయితే అమెరికా ప్రజలు మాత్రం కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలకు అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు. పోలింగ్ బూత్‌ లకు వచ్చి ఓటు చేసే వేయటానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా, అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేసే అధికారం అధ్యక్షుడికి లేదు. అమెరికా రాజ్యాంగం ఎన్నికలు వాయిదా వేసే అధికారాన్ని కేవలం అమెరికన్ కాంగ్రెస్‌ కు మాత్రమే ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: