భార‌త‌దేశాన్ని ఐదు రాష్ట్రాలు వ‌ణికిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే అత్య‌ధిక క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏకంగా సుమారు 60వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మహారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 27,524 పాజిటివ్‌ కేసులు న‌మోదుకాగా 20,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య 9,674కు చేరుకుంది. ఈ రాష్ట్రంలో 7,368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 9,591కు చేరుకోగా.. యాక్టివ్ కేసులు 5,252 ఉన్నాయి. ఆ త‌ర్వాత ఢిల్లీలో 8,470 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా  5,310 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక రాజ‌స్తాన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 4,534కు చేరుకుంది.

 

ఇక దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో పాటు, వైరస్‌ సోకి 100 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజ‌స్తాన్‌ రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 60వేల కేసులు న‌మోదుగాకా మిగ‌తా  రాష్ట్రాల్లో కేవ‌లం 20వేల‌కుపైగా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రాష్ట్రాల్లో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేస్తే భార‌త్ విజ‌యం సాధించిన‌ట్టేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.

 

ఇక్క‌డ మ‌రొక స‌మ‌స్య ఏమిటంటే.. కేరళలోనూ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ తాజాగా మరో 26 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడం, వలస కూలీల తరలింపు, విదేశాల నుంచి స్వదేశానికి ప్రయాణికులను తరలించడం మూలంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తెలంగాణ‌లోనూ మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: