ప్రస్తుతం లాక్ డౌన్  సడలింపు లో భాగంగా వలస కార్మికులు తరలించేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలస కార్మికులు మాత్రం మరీ  తొందర పడుతూ స్వస్థలాలకు నడిచి వెళ్లేందుకు  కూడా సిద్ధపడుతున్నారు. ఇలా నడిచి వెళ్లేందుకు సిద్ధపడ్డ కొంత మంది కార్మికులు ఔరంగాబాద్లో ఏకంగా రైలు పట్టాల కింద నలిగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. దీంతో వలస కార్మికులు అందరికీ రవాణా సౌకర్యాలతో పాటు ఆహార సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 


 అంతేకాకుండా ఔరంగాబాద్ ఘటనకు సంబంధించి కూడా ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక తాజాగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం... వలస కార్మికులు వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం వలస కార్మికులకు రవాణా సౌకర్యాలతో పాటు ఆహార  సౌకర్యం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వాలు వలస కార్మికులు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లు జరిగేంత వరకు వలస కార్మికులు ఓపికతో ఉండాలంటూ  సూచించింది. 

 

 ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వలస కార్మికులు మాత్రం తొందరపడుతూ నడిచి వెళ్ళాలి అనుకుంటే వారిని ఎవరు ఆపగలరు అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రవాణా సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించే వరకూ వలస కార్మికులు ఓపికతో ఉండాలని  సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత రవాణా భోజన సౌకర్యం కల్పించటం  సాధ్యం కాదు అంటూ తెలిపింది సుప్రీంకోర్టు. తమ స్వస్థలాలకు నడిచిపోయే కార్మికులను సుప్రీంకోర్టు ఆపలేదు అంటూ తెలిపింది. వలస కార్మికులు అందరూ ప్రభుత్వాలు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేంత వరకు ఓపిక పట్టాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు జడ్జి తుషార్ మెహతా సూచించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: