ఏపీలో ప్ర‌స్తుతం అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజ్ లో న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ అధికార వైసీపీని ప్ర‌తి చిన్న విష‌యంలోనూ టార్గెట్ చేయాల‌ని చూస్తోంది. అయితే టీడీపీ ఎన్ని రాద్దాంతాలు చేస్తున్నా జ‌గ‌న్ వేగ‌వంత‌మైన నిర్ణ‌యాలు టీడీపీ వాళ్లు విమ‌ర్శ‌లు చేసేందుకు ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. గత నాలుగురోజుల నుంచి టీడీపీ నేతలు కరెంట్ బిల్లులపై నానా రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. అసలే లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైసీపీ ప్రభుత్వం కరెంట్ బిల్లులు వేసి పేదల నడ్డి విరుస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

అంత‌కు ముందు వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఇష్యూతో ల‌బ్ధి పొందాల‌ని టీడీపీ వేసిన ఎత్తులు అన్ని చిత్త‌య్యాయి. ఇక ఇప్పుడు క‌రెంటు బిల్లుల‌పై ప‌డ్డారు.  రెండు నెలల బిల్లు ఒకేసారి కలిపి ఇవ్వడం వల్ల, స్లాబ్ విధానం మారి అధిక బిల్లులు వస్తున్నాయని, అసలు బిల్లులు కట్టొద్దని టీడీపీ నేత బోండా ఉమా చెబుతున్నారు. ఇక దీనిపై పోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బోండా ఉమా లక్ష్యంగా సెటైర్లు వేశారు. 500 యూనిట్లు దాటినవారికే కరెంట్ బిల్ అధికంగా వస్తుందని, పైగా లాక్ డౌన్ వల్ల కరెంట్ వినియోగం పెరిగిందని అందుకే కాస్త కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందని చెప్పారు. 

 

బోండా ఉమాకి బిల్లు చూసి షాక్ కొట్టిందా..? లేక అధికారం లేక షాక్ కొట్టిందా?. విద్యుత్ బిల్లులపై టీడీపీ నేతలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని బుగ్గన మండిపడ్డారు. అయితే బుగ్గన చెప్పినట్లు అధికారం లేకే బోండాకు షాక్ కొట్టిందని విజయవాడ వైసీపీ నేతలు అంటున్నారు. ఆ అధికారం దక్కించుకోవడం కోసమే, బోండా కరెంట్ షాక్‌లు తగులుతున్నాయని మాట్లాడుతున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: