తాలిబన్‌.. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే సంస్థ‌. ఈ సంస్థ ఈ మధ్య భారత్‌పై ప్రేమ చూపిస్తోంది. త‌మ‌కు భారతదేశం సహకరించాలని కోరుతోంది. అదేమిటి.. ఉగ్రవాద సంస్థకు భారతదేశం ఎలా సహకరిస్తుందని అనుకుంటున్నారా..? అయితే తాలిబన్ల వ్యూహం ఏమిటో ఒకసారి చూద్దాం.. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు. అక్క‌డ ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత బ‌లిబ‌న్లు ప‌ట్టుకోల్పోతున్నారు. నిజానికి తాలిబన్లను పెంచి పోషించింది అగ్రరాజ్యం అమెరికా. తాలిబన్లకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చింది పాకిస్తాన్. ఈ రెండు దేశాల సహకారంతో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో పాలన సాగించారు. అనేక అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డారు. అయితే అమెరికాలో బిన్ లాడెన్ ఆధ్వర్యంలో ఉగ్ర దాడి జరిగిన తర్వాత అమెరికా తాలిబన్లపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయింది. అందుకు తగ్గట్టుగానే పాకిస్థాన్ కేంద్రంగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను ఏరిపారేసే కార్యక్రమం చేపట్టింది. తాలిబ‌న్ స్థావ‌రాల‌పై దాడులు చేసింది. ఆ త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ప్ర‌జాస్వామ్య‌బద్ధంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాల్లో జోక్యాన్ని తగ్గించుకోవడం కనిపిస్తోంది.

 

ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని అమెరికా బలగాలను వెనక్కి రప్పించుకుంటోంది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం కూడా తాలిబన్లను గుర్తించ‌డం లేదు. వారిని ఏరిపారేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. తాలిబన్ స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. దీంతో వారు అక్క‌డ క్ర‌మంగా ప‌ట్టుకోల్పోతున్నారు. అయితే ఈ క్రమంలో తాలిబన్లు భారత సహకారం కోసం ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం అధికారికంగా త‌మ‌ను గుర్తించాలని, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తమకు సహకరించాలని కోరుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోతే చాలని, ఆ తర్వాత తాము భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని అని చెబుతున్నారు. ఇందుకు అమెరికా కూడా తెర‌వెనుక ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ ఎప్పుడైనా తాలిబ‌న్ల‌తో అవ‌స‌రం ఏర్ప‌డ‌వ‌చ్చున‌న్న వ్యూహంతో వారికి స‌హ‌క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి భారత ప్రభుత్వం సహకరిస్తోంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ అవసరమైన మందులను కూడా భారత ప్రభుత్వం పంపించిన విషయం తెలిసిందే.. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: