ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ మహమ్మారి విషయంలో మొదటి నుంచి ఏపీ సీఎం జగన్ అలర్ట్ గానే ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ, కఠినమైన నిబంధనలు రూపొందిస్తూ వస్తున్నారు. అలాగే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తూ, ఈ విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు అనే అభిప్రాయం అందరిలోనూ వచ్చేసింది. ఈ వైరస్ తో పాటు మరికొంత కాలం కలిసి జీవించాలనే విషయం అందరికంటే ముందు జగన్ గుర్తించి ప్రకటించారు. దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగినా జగన్ తన మాట వెనక్కి తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఆ తరువాత ప్రపంచ దేశాలకు చెందిన వివిధ ప్రముఖులు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా అందరూ ఇదే విషయాన్ని చెప్పడంతో, జగన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటో అందరికీ అర్థమైంది. అలాగే లాక్ డౌన్ నిబంధనపైన జగన్ మొదటి నుంచి ఇదేరకంగా సూచనలు చేస్తూ వస్తున్నారు. 

 

IHG


ఎక్కువ కాలం లాక్ డౌన్ నిబంధనలు విధించడం వల్ల ప్రజలతో పాటు ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాయని, కోలుకోని విధంగా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది అంటూ చెబుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. రెడ్ జోన్ ఏరియాలో తప్ప మిగతా అన్ని చోట్ల యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా ప్రజలకు అవకాశం కల్పించాలని, అలాగే ప్రజలు సామాజిక దూరం పాటించేలా చేస్తే సరిపోతుంది అంటూ జగన్ చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో 290 క్లస్టర్ లలో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. వాటిని డినోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతించాలని జగన్ నిర్ణయించుకున్నారు. 


కేసుల సంఖ్య అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్ల లో కంటోన్మెంట్ ఏరియా, 500 మీటర్ల బఫర్ కలుపుకుని ఒక కిలోమీటర్ పరిధిలో కంటోన్మెంట్ ఆపరేషన్ కొనసాగిస్తారు. అలాగే ఆంక్షలు కూడా మరింత కఠనం చేస్తారు. మిగిలిన చోట్ల యధావిధిగా కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే 52  రోజులుగా దేశం మొత్తం లాక్ డౌన్ లో వుంది. దీంతో సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, హోటల్, రెస్టారెంట్స్ అన్నీ బంద్ అయ్యాయి. ఆర్థిక కారణాల దృష్ట్యా కొద్దిరోజుల ముందే కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దీంతో అక్కడ సూపర్ మార్కెట్, ప్రజా రవాణా, మద్యం దుకాణాలు, కిరాణా షాపులు పరిమిత సమయంలో తెరిచేందుకు అనుమతిచ్చారు. 

 

IHG


నాలుగో దశ  లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీ లో పలు విద్యా సంస్థలు, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే  లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా హోటల్స్ ,రెస్టారెంట్లు, విద్యా సంస్థలు ప్రారంభించేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయం ప్రకారం చూసుకుంటే యథావిధిగా కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: