ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ దెబ్బకి అని దేశాలు దాదాపు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నిర్ణయం తో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎక్కడిక్కడ లావాదేవీలు నిలిచిపోయాయి. అన్ని రంగాలు క్లోజ్ కావడం తో ఇంటిలో ఉన్న జనాలంతా ఆన్ లైన్ షాప్పింగ్ కి ప్రాధాన్యమిచ్చారు. ఈ పరిస్థితి తో ఇ-కామర్స్ వ్యాపారం బాగా పుంజుకుంది. అమెజాన్ మరియు కొన్ని సంవత్సరాలు గొప్ప వ్యాపారం చేసి బాగా లాభాలు సాధించాయి. ఇదిలా ఉండగా 2020 మొదటి త్రైమాసికంలో 75.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెజాన్ ఆర్జించింది. ఈ సంస్థ సీఈఓ జాజ్ బెజోస్ ప్రపంచంలోని ధనవంతుల అందరికంటే 143 బిలియన్ డాలర్లు కలిగి అత్యంత ఎక్కువ సంపాదనతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో కరోనా వైరస్ రావడం తో ఈ కామెర్స్ బాగా లాభాలు సాధించాయి. 

 

కాగా ఇటీవల టర్నోవర్ తో అతను 2026 నాటికి మొదటి ట్రిలియనీర్ కావచ్చు అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. గణాంకాల ప్రకారం అతని నికర విలువ ప్రతి సంవత్సరం 34 శాతం సగటున పెరుగుతోంది. మరియు 56 ఏళ్ల అతను 2026 లో తన 62 సంవత్సరాల వయస్సులో మొదటి ట్రిలియనీర్ కావచ్చు. తరువాత ఇతని సమీపంలో రాగల వ్యక్తి పేస్ బుక్ అధినేత సీఈవో మార్క్ జుకర్బర్గ్. ఇతను 2036 నాటి అతి పిన్న వయసులో ట్రిలీనియార్  కావచ్చని అంటున్నారు.

 

2036 సంవత్సరానికి మార్క్ జుకర్ బర్గ్ వయస్సు 51 సంవత్సరాలు ఉంటుంది.ఇదిలా ఉంటె అమెరికా దేశానికి చెందిన అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచమంతా మహామారి తో పోరాడుతుంటే ఇతడు వ్యాపారం చేయడం పై మరో పక్క విమర్శలు వస్తున్నాయి. చాలా ప్రముఖ సంస్థలకు చెందిన నాయకులు విరాళాలు ప్రకటించిన ఈయన మాత్రం వ్యాపారాన్ని చేసుకోవడాన్ని అదేవిధంగా సొంత దేశం అమెరికా కు సహాయం అందించడంలో పిసినారిగా వ్యవహరించడం వల్ల విమర్శలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: