ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏమి బాగోలేనట్టు ఉంది. విభజన జరిగిన తరువాత చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇప్పటివరకు ఏమీ జరగలేదు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుండి సరైన విధంగా ఆయన అందకపోవటంతో ఏపీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హుదూద్ తుఫాను వచ్చి చాలా వరకు ఉత్తరాంధ్ర వైజాగ్ ప్రాంతం నష్టపోవటం మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కరోనా వైరస్ రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యంత భారీ మెజార్టీతో తనకు ఇచ్చిన ప్రజల కోసం కష్టపడి పని చేయాలనుకుంటున్న జగన్ కి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కష్టపడి పని చేస్తున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దరిద్రం ఒక దాన్ని తర్వాత ఒకటి వెంటాడుతున్నే ఉంది. 

 

కరోనా వైరస్ బాన్నే ఎదుర్కొంటున్నామని అనుకుంటున్న టైమ్ లోనే విశాఖపట్టణంలో ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ అవ్వడం 12 మంది చనిపోవడం వందలాది మంది హాస్పిటల్ పాలవటం తో ఏపీ ప్రజలు ఇదేమి దరిద్రం సంవత్సరం రా బాబు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉన్నా టైం లో మరో పెను విధ్వంసం లాంటి వార్త వినబడుతోంది. అదేమిటంటే రాష్ట్రానికి తుఫాను రూపంలో మరో సవాలు ఎదురు కాబోతున్నట్లు వాతావరణ శాఖ నుండి సమాచారం.

 

ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి అనుకొని ఉండే దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి శుక్రవారానికి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. రానున్న రెండు రోజుల్లో తుపానుగా మారనుంది. దీనికి ‘యాంపిన్’ అనే పేరు పెట్టేశారు. ఈ నెల 16 కానీ 17 ఉదయానికి తుఫానుగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.దీని ప్రభావం కోస్తా ప్రాంతం మీద ఎక్కువ చూపించే అవకాశం ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: