పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ విస్తరణ పాపం మీదంటే ...మీదని కాంగ్రెస్ , అధికార టిఆరెస్ నాయకులు ఒకరిపై , మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు . గతంతో పోతిరెడ్డిపాడు  హెడ్ రెగ్యులెటర్ ను   ఉమ్మడి  అంధ్రప్రదేశ్  లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విస్తరించాలని  నిర్ణయించినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  నాయకులు సమర్ధించారని టిఆరెస్ నాయకులు , మంత్రులు పేర్కొంటున్నారు . ఇక మాజీ మంత్రి చిన్నారెడ్డి ఏకంగా వైఎస్ నిర్ణయన్ని సమర్ధిస్తూ పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారని గుర్తుచేస్తున్నారు  .

 

అటువంటి కాంగ్రెస్ నేతలకు తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదని అంటున్నారు . తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు . ఇప్పటికే  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచాలన్న  అంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని  కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు , అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు . అయితే  గతంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ విస్తరణ లో  వైఎస్ పాత్ర  ఎంత ఉందో , టిఆరెస్ నాయకత్వం పాత్ర కూడా  అంతే ఉందని మల్కాజ్ గిరి ఎంపీ , టి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడి రేవంత్ రెడ్డి అంటున్నారు . ఆనాడు కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి హోదాలో పోతిరెడ్డిపాడు  హెడ్ రెగ్యులెటర్ విస్తరణ పనులను ప్రారంభించింది మాజీమంత్రి నాయిని నర్సింహా రెడ్డి కాదా ? అని ఆయన  ప్రశ్నిస్తున్నారు  .

 

పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ పనులను ఆనాడే తెలంగాణ  కాంగ్రెస్ నేతలు పీజేఆర్ , శశిధర్ రెడ్డిలు బాహాటంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు . మంత్రిపదవులు కాపాడుకునేందుకు టిఆరెస్ నేతలు , వైఎస్ నిర్ణయాన్ని సమర్దించారని అన్నారు . ఇప్పుడు ఉమ్మడి స్నేహితుడైన ఒక  కాంట్రాక్టర్ ప్రయోజనాలకోసం రెండు తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటర్ సామర్థ్యం పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: