40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేసే విషయంలో రోజురోజుకూ..తన స్థాయిని దిగజార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాను ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోవడం, తనకంటే చాలా జూనియర్ అయిన జగన్ సీఎం కావడం వల్ల, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంపై రాజకీయం చేస్తూనే ఉన్నారు. కనీసం ఓ రేంజ్ లో ఉండే అంశాలపైన కాకుండా  చిన్న చిన్న విషయాలపై సైతం రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

 

అయితే చంద్రబాబు విమర్శలు చేసే విషయంలో తన అర్హతని ఎంతవరకు తగ్గించుకున్నారనే దానికి ఉదాహరణగా ఓ అంశం నిలుస్తోంది. ఇటీవల విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటన విషయంలో వెంటనే స్పందించిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు రూ.కోటి సాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే మిగతా వారికి కూడా సాయం అందించారు. అయితే ఇంత సాయం చేయడంపై అందరూ సీఎం జగన్‌ని ప్రశంసించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయకపోగా, రివర్స్ లో విమర్శలు చేశారు.

 

కోటి సాయం చేస్తే మనిషి ప్రాణం తిరిగొచ్చేస్తుందా అని మాట్లాడారు. సరే ఈ విషయంపై ఏదో రాజకీయం చేశారనుకుంటే తాజాగా ప్రకాశం జిల్లాలో కూలీల మృతుల విషయంలో కూడా రాజకీయం మొదలుపెట్టారు. ముందుగా ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే ఆ సాయం చాలదని చెప్పి, మరో 5 లక్షలు పెంచి 10 లక్షలు ఇచ్చింది.

 

ఇక దీనిపై చంద్రబాబు అందుకుని కూలీల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కూలీలు కుటుంబాలకు ఎంత సాయం చేసిన తక్కువే. కానీ ప్రభుత్వం మాత్రం తనకు సాధ్యమైన మేరకు సాయం అందించింది. చంద్రబాబు మాత్రం దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటానికి 25 లక్షల సాయం అని మాట్లాడుతున్నారు. ఏదేఏమైనా ఈ మధ్య బాబు టిపికల్ పాలిటిక్స్ చేస్తున్నట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: