భారతదేశంలో సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది సీఎం జగన్ అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సీఎంగా ప్రమాణం చేసి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కానీ ఈలోపే తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 80 శాతంపైనే పూర్తి చేసేశారు. ఊహించని విధంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబంలో ఏదొక సంక్షేమ పథకం అందుకున్న వారు ఉన్నారు.

 

ఆర్ధిక పరిస్థితులు బాగోకపోయినా సరే జగన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకాలు అందించారు. తాజాగా లాక్ డౌన్ సమయంలో కూడా తాను అనుకున్న పథకాలని అమలు చేశారు. సున్నా వడ్డీ, జగన్న విద్యా దీవెన అందించారు. ఇక తాజాగా రైతులని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా కార్యక్రమం మొదలుపెట్టారు. వారికి పంటసాయం కింద రూ.5,500 డిపాజిట్ చేస్తున్నారు. ఇంకా రాష్ట్రం కింద వచ్చే మరో రూ.2 వేలుని సంక్రాంతిలో ఇవ్వనున్నారు. అటు పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుంచి వచ్చే రూ.6 వేలు ఎలాగో రైతుల ఖాతాల్లో పడిపోతున్నాయి.

 

అయితే రైతుభరోసా పథకం అమలుపై సీఎంపై మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రశంసలు కురిపించారు. క‌రోనా ప్ర‌భావంతో అన్ని ర‌కాల వ్య‌వ‌స్థ‌లు స్థంభించినా సీఎం రైతు సంక్షేమంపై దృష్టి సారించారని, 49 లక్షల మందికి ప్రభుత్వం నగదు పంపిణీ చేయడం సంతోషకరమ‌న్నారు. ఈ క్రమంలోనే మంత్రి టీడీపీకి అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వం భూములని మిషన్ బిల్డ్ ఏపీ పేరిట అభివృద్ధి చేసి, వాటిని అమ్మి నవరత్నాలు అమలు చేయాలన్న జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశాన్ని తప్పు బడుతున్న టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

 

గతంలో చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుని సింగపూర్ సంస్థలకు అప్పగించారని, అసలు అభివృద్ది పేరుతో భూములను అమ్మడం అనే అంశం పై టీడీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వ అవినీతి తవ్విన కొద్ది బయటపడుతుందని ఓ రేంజ్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే మంత్రి చెప్పిన మాటల్లో వాస్తవముందని కొందరు రాజకీయ విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: