లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన చంద్రబాబు, అక్కడ నుంచే పార్టీని నడిపిస్తున్న విషయం తెలిసిందే. జూమ్ యాప్ లో పార్టీ సమావేశాలు పెట్టి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే మీడియా సమావేశాలు కూడా అందులోనే పెట్టి జగన్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. పనిలో పనిగా జగన్ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తోందో కూడా లెక్క పెడుతున్నట్లున్నారు.

 

తాజాగా పార్టీ నేతలతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బాబు ఏడాది పాలనలో వైసీపీ నేతలు చాలా తప్పులు చేశారని, ఇన్ని తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని, వైసీపీ అక్రమాలపై నిఘా పెట్టాలని, ఎప్పుటికప్పుడు ఫిర్యాదులు పంపాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇక బాబు మాటలకు వైసీపీ అభిమానులు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.

 

బాబు తప్పులు లెక్క వేస్తున్నారని జగన్ భయపడిపోతున్నారని సెటైర్ వేసి, అసలు ఎన్ని తప్పులు లెక్క వేశారో చెప్పాలని అడుగుతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకిత వచ్చిన మాట వాస్తమే అని కానీ అది అన్నీ వర్గాల ప్రజల్లో కాదని, ఓ వర్గంలో మాత్రమే అని విమర్శిస్తున్నారు. వాళ్లే ప్రతి విషయాన్ని నెగిటివ్ చేసే పనిలో ఉన్నారని, సోషల్ మీడియాలో అదే పనిగా జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారని, లేని దాన్ని ఉన్నట్లు క్రియేట్ చేయడం బాబు బ్యాచ్‌కు అలవాటే కదా అని ఫైర్ అయిపోతున్నారు. 

 

ఇక నిఘా పెట్టేది ప్రజలే అని, గతంలో నిఘా పెట్టారు కాబట్టి, బాబుని ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని అప్పుడు బాబు బ్యాచ్ ఇంకా ఖాళీగా కూర్చుని తప్పులు లెక్క పెట్టుకోవచ్చని ఎద్దేవా చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: