కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలతోపాటు ఎక్కువ ఇబ్బందులు పడింది వలస కూలీలు. ఉత్తమ బతుకుదెరువు కోసం  ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి కూలిపనులకు వచ్చినవాళ్లు లాక్ డౌన్ వాళ్ళ పనులు లేక ఇరుక్కుపోయారు. చేతిలో పని లేదు మరియు వెళ్ళటానికి రవాణా వ్యవస్థ లేదు అదే సమయంలో ఊరు గాని ఊరు లో ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ఒక్కసారిగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి వలస కూలీలు ఏం చేయలేక తమ స్వస్థలాలకు పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు. ఇండియా వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వలస కూలీలు ఈ విధంగా కాలిబాట తో తమ స్వస్థలాలకు ప్రయాణం మొదలు పెట్టి కొంత మంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో వలస కూలీల కి ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకమైన రైళ్లు దేశవ్యాప్తంగా తిట్టింది. శ్రామిక రైల్ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీల ను తమ స్వస్థలాలకు చేరుకోవడానికి అవకాశం కల్పించింది. ఇటువంటి సమయంలో గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నుండి ఉత్తరాఖండ్ లో హరిద్వార్ కి చెందిన 1340 మంది వలసకార్మికులతో శ్రామిక్ రైల్ బయలుదేరింది. అయితే తాజాగా ఈ రైలులో ప్రయాణించే వారిలో 167 మంది ప్రయాణికులు మిస్ అయ్యావడం రైల్వే అధికారులకు మరియు నాయకులకు వణుకు పుట్టించింది.

 

గమ్యస్థానాలకు చేరినంతనే.. ప్రయాణికుల జాబితాను తనిఖీ చేసిన అధికారులు కంగుతిన్నారు. ప్రయాణికుల్లో 167 మంది మిస్ కావటంతో.. ఇప్పుడు వారంతా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారన్నది ఇప్పుడు సమస్యగా మారింది. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఉన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో రావటంతో దేశమంతా వణికిపోతోంది. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు ప్రజలంతా. 

మరింత సమాచారం తెలుసుకోండి: