ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ ముందు నుండి విద్యా వ్యవస్థ పై అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ఆరోగ్యంపై చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అనేది పొందాలి అనే లక్ష్యంగా ముందునుండి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. జగన్ ఆధ్వర్యంలో అధికారులు మరియు వైసీపీ నేతలు విద్యావ్యవస్థలో ఇప్పటికే కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో అడ్మిషన్లు పై పరిమితి విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక సెక్షన్ లో గరిష్ఠంగా 40 విద్యార్థులు మాత్రమే ఉండాలి.

 

అలాగే కాలేజీలో కనిష్టంగా నాలుగు సెక్షన్ లు గరిష్టంగా 9 సెక్షన్లు మాత్రమే అనుమతి ఉండేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రానున్న విద్యా సంవత్సరం నుండి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రాబోతున్నాయి. పాఠశాల విద్యా తరువాత అతి ముఖ్యమైంది విద్యార్థులకు ఇంటర్ విద్య. ఇక్కడ విద్యార్థులు ఏ గ్రూప్ తీసుకుంటారో ఏ విధంగా చదువులో రాణిస్తారో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా ఎంపీసీ గ్రూపు తీసుకున్నవారు ఇంజనీరింగ్, బైపిసి గ్రూపు తీసుకున్నవారు మెడిసిన్ వైపు చదివేలా విద్యార్థులు రాణించారు. ఇంతటి విద్య కలిగిన ఇంటర్ విద్య కార్పోరేట్ కాలేజీలకు ధన దాహం గా మారిపోయింది.

 

కనీస వసతులు లేకుండానే కొన్ని కార్పొరేట్ కాలేజ్ లు కాలేజీ నడిపిస్తున్నాయి. అంతేకాకుండా పరిమితికి మించి అడ్మిషన్లు ఇస్తోంది. డబ్బులు భయంకరంగా సంపాదించడమే లక్ష్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఇటువంటి సమయంలో జగన్ సర్కార్ సరి కొత్త సంస్కరణలు తీసుకు వచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. జగన్ సర్కార్ తెచ్చిన సరికొత్త సంస్కరణలు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: