కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బ్యాంకులకు టోపీ పెట్టి బడా పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా లండన్ కి పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుండి లండన్ లోనే ఉంటున్న ఈ మహానుభావుడు నీ ప్రభుత్వాలు ఇండియా కి తీసుకు రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాయి. చేస్తున్న ఏటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ కావడం లేదు. ఈ క్రమంలో తాను ఇండియాలో బ్యాంకుల వద్ద చేసిన అప్పులన్నీ తీర్చేస్తానని  అని అంటున్నా ప్రభుత్వాలు మరియు ఆయా బ్యాంకులు అంగీకరించటం లేదని విజయ్ మాల్యా సమయం దొరికినప్పుడల్లా వాధిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా దేశంలో కరోనా వైరస్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రకటించిన భారీ ప్యాకేజీ గురించి మాల్యా స్పందించాడు.

 

ఇటువంటి సమయంలో తన అప్పులన్నీ తీర్చేస్తానని తనని రుణ విముక్తి చేయాలని మాల్యా  కోరిన ప్రభుత్వాలు ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇక్కడ లిటిగేషన్ ఏమిటంటే విజయ్ మాల్యా డబ్బులు కడతాను అన్నది తాను బ్యాంకుల దగ్గర తీసుకున్న అసలు మాత్రమేనట. అతను చేసిన అప్పులకు వడ్డీలు డబుల్ త్రిబుల్ అవటంతో ఆ మొత్తం చాలా భారీ స్థాయిలో ఉందని బ్యాంకింగ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

 

వాస్తవానికి అతడు ఇండియా నుంచి పారిపోయే సమయానికి వడ్డీలు అసలు స్థాయిలో ఉన్నాయని… ప్రజెంట్ అవి ఇంకో వంద శాతం పెరిగాయని ఇటువంటి సమయంలో అసలు కట్టేస్తే మిగతా వడ్డీల సంగతి ఏంటి అని బ్యాంకింగ్ వర్గాలు ప్రశ్నలు వేస్తున్నాయి. అసలు కట్టేసి కేసులను మాఫీ చేయించుకోవాలని విజయ్ మాల్యా తెగ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. విజయ్ మాల్యా గతంలోనే అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడి ఎవరికీ చెప్పకుండా దేశం విడిచి పారి పోయాడు అక్రమంగా ప్రస్తుతం లండన్ లోనే ఉంటున్నారు. దీంతో అతనికి శిక్ష తప్పదు అని కాబట్టి చట్టాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం భారత్ కి అతని రప్పించాలని బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: