2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బకి చంద్రబాబు ఆలోచనా సరళిలో తేడాలు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా వరకు చంద్రబాబు ఎవరినీ నమ్మరని పైకి ఒకటి చెబుతున్న లోలోపల మరో ఉద్దేశం ఉంటుందని పార్టీలో కొంతమంది నాయకులు చెబుతుంటారు. కేవలం పార్టీలో తనకు నమ్మకం గా ఉండే కొంతమంది మాత్రమే వాళ్ళ మాటలను మాత్రమే పరిగణలోకి చంద్రబాబు తీసుకుంటారని అంటుంటారు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే ఆయనకి నమ్మకమైనవాడు అచ్చెన్నాయుడు. ఆయన మాట తప్ప మరొకరి ఆలోచనలు చంద్రబాబు ఏమాత్రం పరిగణలోకి తీసుకోరు అని అంటుంటారు. అచ్చెన్నాయుడు మీద చంద్రబాబుకి ఉన్న నమ్మకం ఏమిటంటే ఎర్రన్నాయుడు అని బాబుకి వీర విధేయుడిగా ఎర్రన్నాయుడు ఉండటంతో ఆటో ఉత్తరాంధ్రలో ఈ కుటుంబానికి ఇప్పటిదాకా ఓటమి లేకపోవటంతో ఎప్పుడూ గెలుస్తూ ఉండటంతో చంద్రబాబు అచ్చం నాయుడు ని నమ్ముతారని చాలామంది అంటారు.

 

అయితే ఇటీవల అంతకు ముందు బాగా నమ్మకం పెట్టుకొని ఒక నేత పై చంద్రబాబు మైండ్ లో తేడాలు వచ్చినట్లు ఆ నేత పై నమ్మకం కోల్పోయిన టీడీపీ పార్టీలో టాక్. ఆయన మరెవరో కాదు విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా మరియు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ లో యాక్టివ్ గా ఉండటం లేదు.

 

విశాఖ గ్యాస్ లీక్ ఘటన విషయం లో బాధితులను పలకరించడానికి కూడా రాలేదు. అసలు గంటా శ్రీనివాసరావు ఏమైపోయారోనని కూడా చర్చకు వస్తోంది. చంద్రబాబు సైతం ఆయన్ని పట్టించుకుంటున్నారా అన్న డౌట్లు టీడీపీలోనే వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబు గంటా శ్రీనివాసరావు ని పక్కన పెట్టేసినట్లే  అన్న టాక్ టిడిపిలో వినబడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: