పరిపాలన విషయంలో సీనియర్ నాయకులకు అనుభవం ఉన్నవారికి దిమ్మ తిరిగి పోయే విధంగా వ్యవహరిస్తున్నారు జగన్. రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ విషయంలో అలాగే నిర్ణయాల విషయంలో ఏమాత్రం ఎక్కడ వెనకడుగు వేయటం లేదు. చాలా వరకూ ప్రభుత్వ వర్గాల్లో తీసుకున్న నిర్ణయం ఏదైనా న్యాయస్థానాల దాకా వెళుతుంది అంటే ముందే డ్రాప్ అయిపోతారు. అటువంటిది జగన్ కి ముందు నుండి న్యాయస్థానాల విషయంలో ప్రతిసారి అడ్డుతగులుతున్న గాని ఏమాత్రం లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకోవటం మరో పక్క న్యాయస్థానాల్లో పోరాటం మనందరం చూస్తూనే ఉన్నాం.

 

ప్రభుత్వాలు తలపెట్టే సంక్షేమ పథకాలకు ప్రతిసారి ఆటంకం క‌లిగించేందుకు కొంద‌రు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం మిషన్లో గాని మరియు రాజధానుల విషయంలో గాని ఇంకా అనేక విషయాల్లో జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎక్కువగా ప్రతిపక్షాల నుండి కంటే న్యాయస్థానాల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావటం జరిగింది. ఈ పరిణామాలతో అస‌లు వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఏపీ హైకోర్టు అనే స్థాయిలో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కూడా జరిగింది. ఇటువంటి సమయంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి చోటుచేసుకున్న జల వివాదం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయస్థానానికి వెళ్ళటానికి రెడీ అవ్వాలని అధికారులకు సూచించారు.

 

అయితే ఈ విషయంలో కూడా వైయస్ జగన్ ఏ మాత్రం ఆలోచించకుండా మేము కూడా న్యాయపోరాటం చేస్తామని చెప్పడం నిజంగా డేర్ అండ్ డాష్ డెసిషన్ అని ఈ జగన్ డేర్ కి కెసిఆర్ కూడా వామ్మో అనుకునే ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మాత్రం క్లారిటీ తో జగన్ న్యాయస్థానానికి వెళ్ళటం వలన ప్రజలకు కూడా వాస్తవం తెలుస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో ప్రతి సారి ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాలలో ఎదురవుతున్న పరాభవం విషయంలో ప్రభుత్వం తరఫున సరైన లాయర్లు పెట్టుకుంటే బాగుంటుందని కొంతమంది సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: