ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుండి వైయస్ జగన్ ప్రతిపక్ష చంద్రబాబు నీ  ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎంతో అనుభవం రాజకీయాల చాణిక్యుడు అని పేరు ఉన్న చంద్రబాబు నీ ఇరకాటంలో పెట్టే విధంగా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో మరియు మూడు రాజధానుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం చంద్రబాబుని కొన్ని వర్గాలకే పరిమితం అయ్యేలా పక్కా ప్లానింగ్ తో వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబు క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. దాదాపు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం చీలిపోయే విధంగా సామాజిక వర్గాల లెక్కలు తో తన ఎత్తులతో చంద్రబాబు రాజకీయాలను జగన్ చిత్తుచిత్తు చేస్తున్నాడు.

 

చాలా వరకు జగన్ నిర్ణయాలను తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే సమర్థించే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రతిపక్షంగా జగన్ కి టిడిపి నుండి పెద్దగా ఆటుపోట్లు లేకపోయినా కానీ ఎక్కువగా వైఎస్ జగన్ సర్కార్ కి ప్రధాన ప్రతిపక్షంగా హైకోర్టు మారిపోయింది అన్న బలమైన వాదన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం మరియు ఇంకా కొన్ని విషయాలలో హైకోర్టు నుండి ఎదురుదెబ్బలు తగలడం తో పాటు నవ్వుల పాలైన సందర్భాలున్నాయి.

 

గ్రామ సచివాలయలకు మరియు ప్రభుత్వ భవనాలకు వైసిపి పార్టీ రంగులు వేయడం వంటి విషయాలలో జగన్ సర్కార్ కి మొట్టికాయలు గట్టిగాన్నే వేసింది. అంతా బాగానే ఉన్నా సంక్షేమ పథకాలు ప్రకటించే టప్పుడు చప్పట్లు కొట్టే లాగా ఉన్న వాటిని అమలు చేసే ముందు అవి న్యాయస్థానాలు దాకా వెళ్ళటంతో వీగిపోయాయి. ఈ సందర్భంగా జగన్ సలహాదారుల విషయములో మరియు ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలలో లాయర్ల విషయంలో టీం మార్చుకుంటే బాగుంటుంది అన్న బలమైన వాదన సోషల్ మీడియాలో వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: